W.G: ప్రభుత్వం 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్ టైమ్ స్కేల్ (లెవల్-14)కు పదోన్నతి కల్పించింది. వీరిలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉన్నారు. ఈ పదోన్నతి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమెను కార్యదర్శి హోదాకు పెంచినప్పటికీ, ప్రస్తుతం జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ గా అదే స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.