Lokesh కర్మజీవి, గొప్ప లీడర్.. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆయనో కర్మ జీవి.. గొప్ప లీడర్ అంటూ కొనియాడారు.
JC Prabhakar reddy:నారా లోకేశ్ (nara lokesh) యువగళం (yuvagalam) పాదయాత్రపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (prabhakar reddy) ప్రశంసలు కురిపించారు. ఆయనో కర్మ జీవి.. గొప్ప లీడర్ అంటూ కొనియాడారు. లోకేశ్ కాళ్లకు బొబ్బలు వచ్చాయని.. అవీ చూసి తన కళ్లలో నీళ్లు వచ్చాయని చెప్పారు. ప్రజల కోసం పాదయాత్ర చేస్తోన్న లోకేశ్ (lokesh) గొప్ప నాయకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
లోకేశ్‌ను (lokesh) చూసి తనకే బాధ వేసిందని చెబుతున్నారు. ఆయన కుటుంబ సభ్యుల సంగతి చెప్పలేం అన్నారు. లోకేశ్‌తో (lokesh) కలిసి తన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి (ashmith reddy) 3 రోజులు నడిచినందుకే కాళ్ల నొప్పులు అంటున్నాడని గుర్తుచేశారు. లోకేశ్ (lokesh) భార్య, పేరంట్స్కు (parents) నమష్కారం అని చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు లోకేశ్ (lokesh) పాదయాత్ర చేస్తున్నారని.. సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. లోకేష్ (lokesh) నడిస్తే తనకే బాధ వేస్తుందని.. ఆయనకు గుడ్ లక్ చెప్పారు. లోకేశ్ (lokesh) పాదయాత్రకు వస్తోన్న జనం చేస్తే.. ఎన్టీఆర్‌ను (ntr) చూసినట్టు వస్తున్నారని తెలిపారు.
అందరినీ క్షమిద్దామని జేసీ ప్రభాకర్ రెడ్డి (jc prabhakar reddy) అన్నారు. కొందరు అధికారులను మాత్రం వదలొద్దు అని షరతు విధించారు. ఇంకా కష్టమైన ఫర్లేదు.. పాదయాత్ర మాత్రం చేయాలని సూచించారు. ఏపీ బాగుపడలాంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు.
ఇటీవల తాడిపత్రిలో లోకేశ్ (lokesh) పాదయాత్ర చేరగా.. జేసీ బ్రదర్స్ (jc brothers) ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ (dance) చేసి.. శ్రేణులను ఉత్సాహా పరిచారు.
యువగళం పాదయాత్ర సుధీర్ఘంగా జరగనుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన యాత్ర.. శ్రీకాకుళంలో ముగియనుంది. రోజు వివిధ వర్గాలను కలుస్తూ.. వారి సమస్యలను తీరుస్తామని లోకేశ్ హామీ ఇస్తూ వస్తున్నారు.