NLG: సంక్రాంతి వేళ నిషేధిత చైనా మాంజా విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని నల్గొండ డీఎస్పీ శివరామిరెడ్డి హెచ్చరించారు. ప్లాస్టిక్, నైలాన్ మాంజా వల్ల పక్షులు, మూగజీవాలు, మనుషుల ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు. రహస్య విక్రయాలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసి, పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని కోరారు.