»Vignesh Shivan Nayanthara Twins Pics Post Instagram Pics Viral Social Media
Nayan Twins pics: విఘ్నేష్ శివన్, నయనతార కవలల చిత్రం పోస్ట్..పిక్స్ వైరల్
హీరోయిన్ నయనతార(Nayanthara), దర్శకుడు విఘ్నేష్ శివన్(Vignesh Shivan) దంపతులు తమ కవలపిల్లలతో చిత్రాలను(Nayanthara Twins pics) ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ఇవి చూసిన పలువురు అభిమానులు(fans) సంతోషం వ్యక్తం చేస్తుండగా..మరికొంత మంది మాత్రం వారి ముఖాలను మళ్లీ చూపించలేదని నిరాశ చెందుతూ కామెంట్లు చేశారు.
ప్రముఖ హీరోయిన్ నయనతార(Nayanthara), డైరెక్టర్ విఘ్నేష్ శివన్(Vignesh Shivan) దంపతులు తమ జీవితంలోకి వచ్చిన కవలపిల్లలతో సరికొత్త దశను అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 19, 2023న శివన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వారి కవల పిల్లల చిత్రాల ఫోటోను పంచుకున్నారు. క్యాప్షన్‌లో విఘ్నేష్ తన ప్రియమైనవారు తనకు అందించే ఆనందం, ప్రేమకు తన కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నాడు. మన ప్రియమైన వారిలో జరిగే ప్రతిదీ ఆనందం, సంతోషంతో ముడిపడి ఉంటుందని చెప్పాడు. అతను ప్రేమ.. ఆనందానికి మూలం అని ప్రత్యేకంగా చెప్పాడు. ఆ క్రమంలో తన క్యాప్షన్‌ను “బ్లెస్డ్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో ముగించాడు. ఇది తన కుటుంబం, అతని జీవితం పట్ల తనకున్న అపారమైన కృతజ్ఞతను సూచిస్తుందని రాసుకొచ్చాడు.
ఇది చూసిన పలువురు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇంకొంత మంది పిల్లల ముఖాలను చూపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు(comments) చేశారు. ఇంకా ఎన్ని రోజులు చిన్నారుల ముఖాలు కనిపించకుండా ఉంచుతారని ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది సూపర్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ అక్టోబర్ 2022లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఇప్పటికే మార్చి 8న ఓ వీడియో పోస్ట్ చేసి అప్పుడు కూడా వారి పిల్లల ముఖాలను బహిర్గతం చేయలేదు.
నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ గత ఏడాది జూన్ 9న ఓ ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత విఘ్నేష్(Vignesh Shivan) తన ఇన్స్టాగ్రామ్(instagram) ఖాతాలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు సంతోషకరమైన వార్తను పోస్ట్ చేశారు. తన పోస్ట్‌లో విఘ్నేష్ వారి పిల్లల పేర్లను కూడా ఇప్పటికే వెల్లడించాడు. ‘ఉయిర్’ అంటే ‘జీవితం’, ‘ఉలగం’ అంటే ‘ప్రపంచంమని చెప్పాడు. నయనతార తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘జవాన్’లో షారుఖ్ ఖాన్‌తో కలిసి కనిపించనుంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 2, 2023న థియేటర్లలోకి రానుంది. దీంతోపాటు నయనతార రాబోయే తమిళ చిత్రం ‘ఇరైవన్’కి కూడా సైన్ చేసింది.