ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. పిటిషన్ వెంటనే విచారణకు స్వీకరించాలని న్యాయవాది దుష్యంత్ దవే కరోరారు. కేసును సీబీఐకి అప్పగిస్తే సాక్ష్యాలు ధ్వంసమవుతాయని పేర్కొన్నారు. అయితే వచ్చే వారం ఈ కేసును విచారణకు అనుమతి ఇస్తామని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఈ మేరకు తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టులో లంచ్ మోహన్ దాఖలు చేశారు. మూడు వారాల పాటు తీర్పు అమలు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోననే ఉత్కంఠ తెలంగాణలో నెలకొంది. ఉద్దేశపూర్వకంగానే ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. తాము న్యాయ పోరాటం చేసి విజయం సాధిస్తామనే ధీమాలో ఉన్నారు. ప్రస్తుత నాటకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సీబీఐ, సిట్ అంటూ ఈ రెండింటి మధ్య విచారణ వివాదం జరుగుతోంది.