»Telangana Dr Br Ambedkar Grand Son Prakash Ambedkar Praised Telangana Dalit Bandhu Scheme
Dalit Bandhuపై అంబేడ్కర్ మనమడు Prakash Ambedkar ప్రశంసలు
చదువుతోపాటు ఉపాధి కల్పిస్తేనే దళితుల బతుకులు బాగుపడతాయి. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న 30 శాతం మంది ప్రజలను కూడా దళిత బంధు పథకంలో చేర్చాలి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ తో కలిసి మాట్లాడతా.
హైదరాబాద్ లో 125 అడుగుల విగ్రహా ఆవిష్కరణ కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr BR Ambedkar) మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ (Prakash Ambedkar) తెలంగాణకు విచ్చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ప్రకాశ్ అంబేడ్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల కోసం తీసుకొచ్చిన దళిత బంధు పథకం (Dalit Bandhu Scheme) కార్యక్రమాన్ని పరిశీలించేందుకు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ (Huzurabad) నియోజకవర్గంలో పర్యటించారు.
తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసిన విషయం తెలిసిందే. ఆ నియోజకవర్గంలో వంద శాతం విజయవంతంగా దళితబంధు అమలు చేశారు. దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన ఎంతో మంది దళితులు జీవితంలో స్థిరపడ్డారు. జమ్మికుంటలో (Jammikunta) దళిత బంధు యూనిట్లను మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar), ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman), ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో కలిసి ప్రకాశ్ అంబేడ్కర్ పరిశీలించారు. లబ్ధిదారులతో పథకం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం. ఈ పథకం సరికొత్త ప్రయోగం. దళిత బంధు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే బాగుంటుంది. చదువుతోపాటు ఉపాధి కల్పిస్తేనే దళితుల బతుకులు బాగుపడతాయి. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న 30 శాతం మంది ప్రజలను కూడా దళిత బంధు పథకంలో చేర్చాలి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ తో కలిసి మాట్లాడతా’ అని ప్రకాశ్ అంబేడ్కర్ తెలిపారు. దళిత బంధు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని స్థిరపడిన దళిత కుటుంబాలకు ప్రకాశ్ అంబేడ్కర్ అభినందనలు తెలిపారు.