»Balagam Movie Climax Scene Repeat In Jammikunta Karimnagar District
Jammikuntaలో వింత ఘటన.. పేక ముక్కలు పెడితేనే పిండం ముట్టిన కాకులు
ఎంతసేపటికి అవి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆలోచనలో పడ్డారు. వెంకట్రాజానికి ఇష్టమైన వస్తువులు ఏమిటో.. ఇష్టమైన భోజనం ఏమిటో తెలుసుకున్నారు. అన్ని విస్తరాకులో పెట్టినా ఎందుకు రావడం లేదని ఆలోచించారు.
బలగం సినిమాతో (Balagam Movie) తెలంగాణ (Telangana) సంస్కృతి, సంప్రదాయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కాకి ముట్టుడు అనేది తెలంగాణలో కీలకమైన కార్యక్రమం. దాని చుట్టునే కథ అల్లుకుని తీయడం అందరినీ మెప్పించి కన్నీటి పర్యంతం చేసింది. అలాంటి సంఘటనే కరీంనగర్ జిల్లాలో (Karimnagar) చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన మరింత ఆసక్తికరంగా ఉంది. ఇష్టమైన వస్తువులు పెట్టడంతోనే కాకులు (Crows) పిండం ముట్టాయి. అయితే ఆ వస్తువు ఏమిటో తెలుసా? పేకాట ముక్కలు (Playing Cards). వివరాలు ఇలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట (Jammikunta) ఆబాది గ్రామానికి చెందిన పూదరి వెంకట్రాజం ఇటీవల మృతి చెందాడు. ఈనెల 28వ తేదీన ఐదు రోజుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రాజం ఇష్టపడిన ఆహార పదార్థాలు (Food Items), పానీయాలు (Drinks) పెట్టారు. ఈ క్రమంలో పిండం పెట్టగా ఒక్క కాకి రాలేదు. అచ్చం బలగం సినిమాలో మాదిరి కాకులు ముట్టకపోవడంతో కుటుంబసభ్యులు (Family Members), బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంతసేపటికి అవి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆలోచనలో పడ్డారు. వెంకట్రాజానికి ఇష్టమైన వస్తువులు ఏమిటో.. ఇష్టమైన భోజనం ఏమిటో తెలుసుకున్నారు. అన్ని విస్తరాకులో పెట్టినా ఎందుకు రావడం లేదని ఆలోచించారు.
చివరికి ఒకరికి గుర్తుకు వచ్చింది. వెంటనే దుకాణానికి వెళ్లి పేకాట ముక్కలు తీసుకువచ్చారు. వెంటనే వేరే విస్తరాకులో కార్డులు (Currency) ఉంచారు. దాంతోపాటు కొంత డబ్బును ప్లేట్ (Plate)లో పెట్టారు. అనంతరం పక్కకు వెళ్లగా.. అనూహ్యంగా కాకులు వచ్చి వాలాయి. పేక ముక్కలు, డబ్బు పెట్టిన తర్వాత వెంటనే కాకులు వచ్చి పిండం ముట్టాయి. వచ్చి మొత్తం తినేశాయి. దీన్ని కుటుంబసభ్యులు, బంధుమిత్రులు (Relatives) ఆశ్చర్యంగా చూశారు. ఇదంతా అందరూ ఆసక్తిగా గమనించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ (Viral)గా మారింది.