Telangana: నామినేషన్లు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థులు.. వారి ఎన్నిక లాంఛనమే
ఎమ్మెల్యే కోటా (MLA Quota)లో వారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత (BRS Party), ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఎమ్మెల్సీ (Telangana MLC Elections) ఎన్నికల అభ్యర్థులు నామినేషన్ (Nomintaions) దాఖలు చేశారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అసెంబ్లీలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్ (Deshapathi Srinivas), మాజీ రాష్ట్రపతి మనువడు చల్లా వెంకట్రామి రెడ్డి (Challa Venkatrami Reddy)తో పాటు కుర్మయ్యగారి నవీన్ కుమార్ (Kurumaiahgari Naveen Kumar ) నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే కోటా (MLA Quota)లో వారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత (BRS Party), ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఇతర మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తెలంగాణ (Telanaagna) రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్ధులుగా దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఇటీవల ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 3 శాసన మండలి స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ముగ్గురు శాసనమండలి సభ్యుల పదవీకాలం.. ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది. ఆయా స్థానాలకు ఒకరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
మార్చి 23న పోలింగ్ కు షెడ్యూల్ విడుదల చేయగా.. పోటీ లేకపోవడంతో వారే లాంఛనంగా ఎన్నిక కానున్నారు. కాకపోతే అదే రోజు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సంఖ్యా బలం బీఆర్ఎస్ కు అత్యధికంగా ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఖాళీ కాగా వాటికి ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయనుంది. ఈ మేరకు గురువారం జరుగనున్న మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రిమండలి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.