»Tdp Councillor Mrs Selvi Elected As Chairperson Of Pbmc
Port Blair: టీడీపీ, బీజేపీ దోస్తీ.. అండమాన్ నికోబర్ దీవిలో సంచలన విజయం
పోర్ట్ బ్లెయిర్ విజయం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తున్నది. త్వరలో రాబోతున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో (Assembly Elections) టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని తెలుస్తున్నది. గతంలో మిత్రులుగా కొనసాగిన వీరిద్దరూ అరాచక పాలన సాగిస్తున్న జగన్ (YS Jagan) ఓడించేందుకు వీరిద్దరూ జత కట్టడం చారిత్రక అవసరంగా అందరూ గుర్తిస్తున్నారు.
పాత మిత్రులు మళ్లీ కలిశారు. శత్రువు శత్రువుకు మిత్రుడు అన్నట్టు తమ ఉమ్మడి ప్రత్యర్థిని ఓడించేందుకు ఇద్దరు శత్రువులు కలిసిపోయారు. ఫలితంగా చైర్ పర్సన్ (Chairman) పీఠాన్ని అధిరోహించారు. తెలుగు వారు అత్యధికంగా ఉండే దీవి అండమాన్ నికోబర్ (Andaman and Nicobar Islands). అక్కడి జనాభాలో మూడో వంతు తెలుగు (Telugu People)వారు ఉండడంతో అక్కడ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party -TDP)కి మంచి ఆదరణ ఉంది. తాజాగా అండమాన్ నికోబర్ దీవి పోర్ట్ బ్లెయిల్ (Port Blair Municipal Council- PBMC) మున్సిపల్ చైర్ పర్సన్ (Muncipal Chairperson) పదవిని టీడీపీ నాయకురాలు అధిష్టించారు. బీజేపీ మద్దతుతో ఆమె విజయం సాధించడం విశేషం. ఈ విజయంతో టీడీపీ, బీజేపీ మళ్లీ కలుస్తాయనే చర్చకు బలం ఏర్పడింది. కాగా ఈ విజయంపై టీడీపీ, బీజేపీ హర్షం వ్యక్తం చేశాయి.
2010లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (Muncipal Elections) టీడీపీ (TDP) 4 శాతం ఓట్లు సాధించి ఒక సీటు గెలుచుకుంది. 2015 ఎన్నికల్లో రెండు కౌన్సిల్ స్థానాలను నిలబెట్టుకుంది. 2022లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 24 వార్డు స్థానాల్లో టీడీపీ మళ్లీ రెండు స్థానాలను సొంతం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పదేసి చొప్పున గెలువగా కాంగ్రెస్ 2, బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి, డీఎంకే (DMK) తలా ఒక చోట గెలుపొందారు. అయితే మెజార్టీ ఎవరికీ రాకపోవడంతో మున్సిపల్ చైర్మన్ ను సొంతం చేసుకోవడంతో బీజేపీ, టీడీపీ జత కట్టాయి.
2022లో టీడీపీ మద్దతుతో బీజేపీ మున్సిపల్ చైర్మన్ పదవిని పొందింది. ఒప్పందంలో భాగంగా ఏడాది తర్వాత ప్రస్తుతం టీడీపీ చైర్మన్ పదవిని స్వీకరించింది. బీజేపీ మద్దతుతో మంగళవారం టీడీపీ కౌన్సిలర్ ఎస్.సెల్వీ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. ఆమె రెండేళ్ల పాటు పదవిలో ఉంటారు. అనంతరం తదుపరి రెండేళ్లు బీజేపీ చైర్మన్ పదవిలో కొనసాగుతుంది. కాగా దీవిలో కలిసి విజయం సాధించడంపై టీడీపీ, బీజేపీలు హర్షం వ్యక్తం చేశాయి.
‘అభివృద్ధికి చోదక శక్తిగా బీజేపీ-టీడీపీ కూటమి నిలుస్తుందన్న ప్రజల విశ్వాసానికి సెల్వి విజయం నిదర్శనం’ అని చంద్రబాబు (N Chandrababu Naidu) ట్వీట్ చేశారు. ఈ విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) హర్షం వ్యక్తం చేస్తూ చైర్ పర్సన్ సెల్వికి శుభాకాంక్షలు తెలిపారు. ‘టీడీపీ-బీజేపీ కూటమికి అభినందనలు. ప్రధాని మోదీ దార్శనికతపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం’ అని పేర్కొన్నారు. కాగా పోర్ట్ బ్లెయిర్ విజయం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తున్నది. త్వరలో రాబోతున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో (Assembly Elections) టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని తెలుస్తున్నది. గతంలో మిత్రులుగా కొనసాగిన వీరిద్దరూ అరాచక పాలన సాగిస్తున్న జగన్ (YS Jagan) ఓడించేందుకు వీరిద్దరూ జత కట్టడం చారిత్రక అవసరంగా అందరూ గుర్తిస్తున్నారు. తదుపరి పరిణామాలు పొత్తు దిశగా సాగుతాయని పసుపు, కాషాయ శ్రేణులు భావిస్తున్నాయి.