»Brs Party Mps Continue Protest In Parliament On Gautam Adani Scam
అదానీ కుంభకోణంపై జేపీసీకి పట్టు.. స్తంభించిన పార్లమెంట్
దర్యాప్తు సంస్థలు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేశాయి. రాజ్య సభ, లోక్ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనమెందుకు అని ప్రశ్నిస్తున్నారు. మదుపర్ల సంపద కన్నా మోదీకి తన స్నేహితుడు గౌతమ్ అదానీ స్నేహం ఎక్కువ అని నిలదీస్తున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ (Parliament Session) సమావేశాలు పున:ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు రాలేదు. గౌతమ్ అదానీ (Gautam Adani Scam) కుంభకోణంపై విచారణ చేపట్టాలంటూ ప్రతిపక్ష పార్టీ (Opposition Parties)లు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాయి. గత నెల వాయిదా పడిన సమావేశాలు సోమవారం పున:ప్రారంభం కాగా రెండు రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. గతనెల బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అదానీ కుంభకోణంపై విచారణ (Investigation) చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉభయసభ (Both Sabha)ల్లో ఆందోళనలు చేపట్టారు. అదానీ కుంభకోణంపై సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కే కేశవరావు చైర్మన్ ధన్ కర్ (Dhankar)ను కోరారు. ఈ సందర్భంగా రూల్ 267 కింద రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి అదానీపై జేపీసీ వేయడంపై చర్చ చేయాలని కేశవరావు తన లేఖలో పేర్కొన్నారు. లోక్ సభలోనూ ఇదే అంశంపై చర్చకు పట్టుబడుతూ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు (Nama Nageswara Rao) డిమాండ్ చేశారు. లోక్ సభలోనూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
ప్రతిపక్షాలు పట్టుపట్టడంతో చర్చలు కొనసాగకుండానే సభలు వాయిదా పడ్డాయి. ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కూడా ఆందోళన కొనసాగించాయి. దర్యాప్తు సంస్థలు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేశాయి. రాజ్య సభ, లోక్ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనమెందుకు అని ప్రశ్నిస్తున్నారు. మదుపర్ల సంపద కన్నా మోదీకి తన స్నేహితుడు గౌతమ్ అదానీ స్నేహం ఎక్కువ అని నిలదీస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సభలో నినాదాలు చేశారు. అదానీ కుంభకోణంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశాయి.