»Tdp Mla Questions Ys Bharathi Reddy And Sakshi Daily
MLA Dola: భవానీ అసెంబ్లీకే రాలేదు, వైయస్ భారతిని సభకు పిలుస్తారా?
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు (Telugu Desam Party MLAs) స్పీకర్ పైన దాడి (Attack on Speaker) చేస్తున్నట్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పత్రిక సాక్షిలో (Sakshi News Paper) ఫోటో వేశారని, అందులో రాజమహేంద్రవరం (Rajahmundry City Assembly constituency) ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ (MLA Adireddy Bhavani) కూడా ఉన్నట్లు చూపించారని, కానీ అందులో నిజం లేదని, సోమవారం నాటి సభకు భవానీ హాజరు కూడా కాలేదని ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ నేత డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి (sri bala veeranjaneya swamy mla) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు (Telugu Desam Party MLAs) స్పీకర్ పైన దాడి (Attack on Speaker) చేస్తున్నట్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పత్రిక సాక్షిలో (Sakshi News Paper) ఫోటో వేశారని, అందులో రాజమహేంద్రవరం (Rajahmundry City Assembly constituency) ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ (MLA Adireddy Bhavani) కూడా ఉన్నట్లు చూపించారని, కానీ అందులో నిజం లేదని, సోమవారం నాటి సభకు భవానీ హాజరు కూడా కాలేదని ప్రకాశం జిల్లా కొండేపి ఎమ్మెల్యే, తెలుగు దేశం పార్టీ నేత డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి (sri bala veeranjaneya swamy mla) ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ సస్పెండ్ చేసిన జాబితాలో కూడా భవానీ పేరు లేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేల పైన వైసీపీ సభ్యులు శాసన సభలో దాడులు చేయడమే కాకుండా, టీడీపీ సభ్యులే తమ పైన దాడి చేశారని అవాస్తవాలు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సోమ వారం కనీసం సభకు రాని ఆదిరెడ్డి భవానీ (Adireddy Bhavani) ఉన్నట్లుగా సాక్షిలో ప్రచురించి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. సాక్షి అబద్దాల పుట్ట అనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.
ఇప్పుడు సాక్షి పత్రిక చైర్మ పర్సన్ వైయస్ భారతిని (Sakshi chair person YS Bharathi) అసెంబ్లీకి పిలిపిస్తారా అని ప్రశ్నించారు. ఎవరిని పిలిచి మోకాళ్ల పైన నిలబెడతారని నిలదీశారు. టీడీపీ వారు నిబద్ధత కలిగి ఉంటారని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తులు అన్నారు. సాక్షి పత్రిక పైన సత్యమేవ జయతే అని రాసుకుంటుందని, కానీ అన్ని అసత్యాలే రాస్తుందన్నారు. సభలో లేని ఎమ్మెల్యే భవానీ పేరు పెట్టి స్పీకర్ పైన దాడి చేసినట్లు ప్రచురించడం దారుణమన్నారు. శాసన సభలో ప్రజా సమస్యల పైన గళమెత్తి ప్రశ్నిస్తున్నాననే అక్కసుతో వైసీపీ ఎమ్మెల్యే ఉద్దేశ్యపూర్వకంగా తనపై, టీడీపీ సభ్యులపై దాడి చేశారని మండిపడ్డారు. తాను అసభ్య పదజాలం వాడినట్లు సాక్షి రాసిందని, మరి రికార్డుల్లో చూపించగలరా అని ప్రశ్నించారు. శాసన సభలో ఏం జరిగిందో తెలియాలంటే ఎడిటింగ్ లేకుండా వీడియోను బయటకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.