Achennaidu Responce on AP Budget : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై అచ్చెన్నాయుడు కామెంట్స్..!
అసెంబ్లీలో నేడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ను మంత్రి సభ ముందు ఉంచారు. ఈ బడ్జెట్ ఫై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.

వైస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చిట్ట చివరి బడ్జెట్ కూడా మోసపూరితమే అని అన్నారు. ఘనంగా కేటాయింపులు చూపుతూ ఖర్చు మాత్రం భూతద్దంలో వెతికినా కనిపంచని విధంగా ఉన్న గత బడ్జెట్ల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు.
శస్త్ర చికిత్స విజయవంతం… రోగి మృతి అన్నట్లుగా బడ్జెట్ను రూపొందించారని ఎద్దేవా చేశారు. కమిషన్ల కోసమే సాగునీటి రంగానికి రూ.22 వేల కోట్ల కేటాయింపులు చూపారన్నారు. సీఎం జగన్ ప్రారంభించిన రెండు ప్రాజెక్టులు టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం పనులు పూర్తి చేసుకున్నవే అని తెలిపారు. 6 లక్షలపై చిలుకు ఉద్యోగాలు కల్పించినట్లు సిగ్గులేకుండా అసత్యాలు చెప్పారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.