»Tamil Nadu Cm Mk Stalin Takes Bullet Train Journey In Japan After A Tweet For India
CM Stalin: భారత్ కు బుల్లెట్ ట్రైన్ కావాలంటున్న సీఎం..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) జపాన్(Japan) పర్యటనలో ఉన్నారు. ఆదివారం జపాన్‌లోని ఒసాకా(osaka) నుంచి రాజధాని టోక్యో(tokyo)కు దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించారు.
CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) జపాన్(Japan) పర్యటనలో ఉన్నారు. ఆదివారం జపాన్‌లోని ఒసాకా(osaka) నుంచి రాజధాని టోక్యో(tokyo)కు దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రయాణాన్ని ప్రారంభించేటప్పుడు, స్టాలిన్ కొన్ని చిత్రాలను ట్వీట్(tweet)లో పంచుకున్నారు. బుల్లెట్ రైలు(Bullet train) ప్రాజెక్టుకు సంబంధించి భారతదేశానికి కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.
ఈ యాత్రను ప్రారంభిస్తూ స్టాలిన్ ఓ ట్వీట్లో మాట్లాడుతూ.. ఒసాకా నుంచి టోక్యో వరకు బుల్లెట్ రైలు ప్రయాణం దాదాపు 500 కిలోమీటర్ల దూరాన్ని రెండున్నర గంటల్లోపు చేరుకోనుంది. భారత్‌లోనూ ఇలాంటి రైలు నడపాలని అన్నారు. ఇది దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రయాణం కూడా సులభం అవుతుంది. ట్వీట్ చివర్లో ఫ్యూచర్ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌ని కూడా ఉపయోగించాడు.
పెట్టుబడుల జపాన్ కు వెళ్లిన స్టాలిన్
స్టాలిన్ తన బుల్లెట్ రైలు ప్రయాణానికి సంబంధించిన అనేక చిత్రాలను కూడా పంచుకున్నారు. తమిళనాడులో పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో స్టాలిన్ జపాన్‌లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఇక్కడ ఆయన పలువురు వ్యాపారవేత్తలను కూడా కలుసుకుని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు. భారతదేశంలో కూడా బుల్లెట్ రైలు నిర్వహణ కోసం.. ముంబై , అహ్మదాబాద్ మధ్య కారిడార్ నిర్మిస్తున్నారు. జపాన్ సహకారంతోనే కారిడార్ నిర్మాణం జరుపుకుంటోంది. సెప్టెంబరు 14, 2017న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అతని జపాన్ ప్రధాని షింజో అబే దీనికి పునాది వేశారు. 2026 నాటికి భారతదేశంలో మొదటి బుల్లెట్ రైలు నడిచే అవకాశం ఉంది.
జనవరిలో, బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. గుజరాత్లో 25.28 కి.మీ ట్రయల్ రన్ పూర్తయిందని అందులో పేర్కొన్నారు. దీంతోపాటు బుల్లెట్ రైలుకు సంబంధించిన ఇతరత్రా పనులు వేగంగా జరుగుతున్నాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు లక్షా ఎనిమిది వేల కోట్లు. ముంబై, అహ్మదాబాద్ మధ్య 12 స్టేషన్లు ప్రతిపాదించబడ్డాయి. అదే సమయంలో బుల్లెట్ రైలు వేగం గంటకు 320 కిలోమీటర్లుగా ఉండవచ్చని అంచనా.
ஒசாகா நகரிலிருந்து டோக்கியோவுக்கு #BulletTrain-இல் பயணம் செய்கிறேன். ஏறத்தாழ 500 கி.மீ தூரத்தை இரண்டரை மணிநேரத்திற்குள் அடைந்துவிடுவோம்.
உருவமைப்பில் மட்டுமல்லாமல் வேகத்திலும் தரத்திலும் #BulletTrain-களுக்கு இணையான இரயில் சேவை நமது இந்தியாவிலும் பயன்பாட்டுக்கு வர வேண்டும்; ஏழை -… pic.twitter.com/bwxb7vGL8z