»Tamil Director Venkat Prabhu Comments On Telugu Movies
Venkat prabhu : తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ ఇంట్రస్టింగ్ కామెంట్..!
వెంకట ప్రభు(venkat prabhu) దర్శకత్వంలో నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కస్టడీ. ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. అదే విధంగా ఏకకాలంలో విడుదల కూడా చేస్తున్నారు. మరో పక్క ఈ సినిమాని హిందీలో కూడా డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
కస్టడీ మూవీ(custody movie) రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్(Venkat prabhu) చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు సినిమాలు చాలా డామినేటింగ్ గా ఉన్నాయని ఆయన చెప్పడం విశేషం. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అందులో ఓ విలేకరి ఆయనను ఓ ప్రశ్న అడిగారు. తెలుగు, కన్నడ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అవుతుంటే, తమిళ సినిమా ఎందుకు సక్సెస్ కావడం లేదు అని ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు.
తమిళ డైరెక్టర్లు(tamil directors) కేవలం తమిళ ప్రజల కోసమే సినిమాలు తీస్తున్నారేమోనన్నారు. విజయ్ లియో సినిమా మాత్రం కచ్చితంగా అన్ని భాషల్లోనూ సక్సెస్ అవుతుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. తెలుగు సినిమాలు, తెలుగు దర్శకులంత అదృష్టం అయితే తమకు లేదన్నారు. నెమ్మదిగా తమిళ సినిమా కూడా ఆ రేంజ్ కి ఎదుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పొన్నియన్ సెల్వన్ పాన్ ఇండియాలో విడుదల చేశారు. కానీ అది తమిళంలో తప్ప ఇతర భాషల్లో పెద్దగా సక్సెస్ కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు మీడియా ముందు తమిళ సినిమాను కించ పరడం లాంటివి చేయడం ఆయనకు ఇష్టం లేదు. అందుకే తెలివిగా ఈ ఒక్క ఆన్సర్ చెప్పి, టాపిక్ డైవర్ట్ చేశాడు. ఇదిలా ఉండగా, కస్టడీ మూవీ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నాగచైతన్య(Naga Chaitanya) ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తున్నాడు.