Sourav Ganguly Biopic: హీరోగా స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్!
సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం రణ్‌బీర్ కపూర్ ఒప్పకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలో కోల్‌కతాలో ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని నెట్టింట ఈ వార్త హల్ చల్ చేస్తుంది.
సౌరవ్ గంగూలీ(sourav ganguly) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. BCCI మాజీ ప్రెసిడెంట్, భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ(sourav ganguly) బయోపిక్ త్వరలో రాబోతుంది. అయితే తాజాగా ముంబైలో రాబోయే చిత్ర నిర్మాతలను కలవడానికి ముందు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇదే విషయాన్ని చెప్పాడు. తన అభిమానులలో దాదా అని ముద్దుగా పిలుచుకునే సౌరవ్, స్క్రిప్ట్ చివరి దశలో ఉందని ఓ సమావేశంలో భాగంగా వెల్లడించాడని సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో హీరోగా రణబీర్ కపూర్ నటించేందుకు ఖరారైనట్లు తెలిసింది. ఈ బయోపిక్ కోసం అతను ఒప్పుకున్నాడని టాక్. ఈ క్రమంలో సౌరవ్ రణబీర్(ranbir kapoor) పట్ల తన అభిమానాన్ని పదే పదే వ్యక్తం చేసినట్లు వినిపిస్తోంది.
అయితే 2019లో ఈ సినిమా గురించి హృతిక్ రోషన్(hrithik roshan), రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా(sidharth malhotra) సహా పలువురు ప్రముఖ బాలీవుడ్ నటీనటులను ఈ సినిమాకు కలిసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్‌గా నటించడానికి తెరపై వ్యక్తిగా ఎవరు నటిస్తారనేది అధికారికంగా ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో సౌరవ్ అభిమానులు గంగూలీని ఎవరి ద్వారా తెరపైకి వస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ త్వరలో కోల్‌కతాకు వచ్చి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్, CAB ఆఫీస్, సౌరవ్ గంగూలీ ఇంటిని కూడా సందర్శించే అవకాశం ఉందని సమాచారం. హృతిక్, సిద్ధార్థ్ మల్హోత్రా(sidharth malhotra) నుంచి ఎలాంటి సమాచారం లేని క్రమంలో రణ్ బీర్ నటిస్తారని తెలుస్తోంది.
మరోవైపు ఈ బయోపిక్ మూవీని 200 నుంచి 250 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాను తొందరపడటం లేదని, షూట్‌ను ప్రారంభించడానికి ముందు ప్రతిదీ సరిగ్గా ఉండాలని సౌరవ్ గతంలో చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు, అతను స్క్రిప్ట్(script) చివరి భాగానికి ఓకే చెప్పాడని త్వరలోనే కోల్‌కతా(kolkata)లో షూటింగ్ ప్రారంభమవుతుందనే వార్త నెట్టింట చక్కర్లు కోడుతుంది. ఇంకోవైపు ఈ చిత్రానికి దర్శకుడు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరనే విషయాలు సినిమా అధికారికంగా ప్రకటించిన తర్వాత తెలియనున్నాయి.