Oil Factory accident: ఆయిల్ ట్యాంకర్లోకి దిగి 7గురు మృతి
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్లోకి దిగిన ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. పెద్దాపురం మండలం జి రాగంపేటలో ఇది జరిగింది.
కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయిల్ ట్యాంకర్లోకి దిగిన ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. పెద్దాపురం మండలం జి రాగంపేటలో ఇది జరిగింది. స్థానిక ఆయిల్ ఫ్యాక్టరీలోని ట్యాంకర్ను శుభ్రం చేసేందుకు ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు లోనికి దిగారు. అందులో ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకొని, పరిశీలించారు. మృతి చెందినవారిలో పాడేరుకు చెందినవారు అయిదుగురు ఉన్నారు. మిగిలిన ఇద్దరు పులిమేరు గ్రామస్తులు. రామారావు, కృష్ణ, నర్సింహ, సాగర్, బంజిబాబు, జగదీష్, ప్రసాద్ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ ఏడాది క్రితం ప్రారంభమైంది. కార్మికులు పదిహేను రోజుల క్రితమే ప్యాక్టరీలో చేరారని తెలుస్తోంది.