»Santhanuthalapadu Pamphlets Out Against Ysrcp Mla Tjr Sudhakar Babu
YSRCP మరో ఎమ్మెల్యేను పంపించే యత్నం.. ‘వద్దు.. ముద్దు’ పేరిట కరపత్రాలు కలకలం
నీచపు పనితో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేసి సాగనంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా మరో ఎమ్మెల్యేను సాగనంపే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం కలకలం రేపింది.
తమ పార్టీ ఎమ్మెల్యేలను (MLAs) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పొమ్మనలేక పొగబెడుతున్నట్టు కనిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం.. వారికి పోటీగా సమన్వయకర్తలను (Co-ordinator) నియమించడం.. అధికారాలన్నీ పరోక్షంగా బదిలీ చేయడం వంటి వాటితో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో (Nellore District) ఈ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇలాంటి నీచపు పనితో ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ (Suspend) చేసి సాగనంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజా మరో ఎమ్మెల్యేను సాగనంపే ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. ఏకంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం కలకలం రేపింది. ‘అవినీతి ఎమ్మెల్యే వద్దు.. సమన్వయకర్త ముద్దు’ అంటూ వైఎస్సార్ సీపీపేరుతో కరపత్రాలు (Pamphlets) వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ఎమ్మెల్యేను త్వరలోనే సాగనంపుతారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు (Santhanuthalapadu) వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు (TJR Sudhakar Babu). అతడి తీరుపై పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. గతంలో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న నాయకులు ఇప్పుడు బహిరంగంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ‘అవినీతి ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వద్దు.. పార్టీ సమన్వయకర్త ముద్దు. ఇట్లు సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు’ అని ఉన్న కరపత్రాలు వెలుగులోకి వచ్చాయి. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ఈ కరపత్రాలు కనిపించాయి.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కరపత్రాలు కనిపించడం కలకలం రేపాయి. రైల్వే స్టేషన్ (Railway Station)కు వెళ్లే మార్గంలో ఇవి కనిపించాయి. ఈ కరపత్రాలు సంతనూతలపాడు నియోజకవర్గంలో అలజడి మొదలైంది. ఎమ్మెల్యేను పంపించేందుకు పార్టీ సిద్ధమైందనే చర్చ సాగుతోంది. ఈ కరపత్రాల వెనుక పార్టీ ఉందని సమాచారం. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలను సాగనంపిన మాదిరి సుధాకర్ బాబును పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రక్రియలో ఈ కరపత్రాలు బయటకు వచ్చాయని ప్రకాశం జిల్లాలో (Prakasam District) చర్చ కొనసాగుతోంది. ఎమ్మెల్యే ఆగడాలు అధికమవడంతో త్వరలోనే పార్టీ సమన్వయకర్తను నియమించనుందని సమాచారం. కాగా ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఇటీవల అసెంబ్లీలో టీడీపీ కొండేపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయ స్వామిపై దాడి చేసి వార్తల్లో నిలిచాడు. ఆయనే దాడి చేసి బయటకు వచ్చి తనపైనే దాడి జరిగిందని కట్టుకథ అల్లాడు.