ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటే ఒక బ్రాండ్ అని, ఆ పేరే ఓకే జోష్ అని ఆ పార్టీ నాయకురాలు, మంత్రి రోజా అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ఊహించని స్పందన వచ్చిందని, ఇది చాలా ఆనందంగా ఉందని చెప్పారు. పర్యాటక రంగంలో 22 వేల కోట్లకు సంబంధించిన ఎంవోయులు జరిగాయని చెప్పారు. పర్యాటక రంగంలో ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. వంద శాతం ఈ ప్రతిపాదనలు గ్రౌండ్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి పైన ఉన్న నమ్మకంతోనే 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, ఈ మేరకు ఎంవోయులు కుదిరాయని చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కరోనా కారణంగా పారిశ్రామిక, పర్యాటక రంగంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. విశాఖ సమ్మిట్ తర్వాత అన్ని దేశాలు ఆంధ్ర ప్రదేశ్ వైపు చూస్తయని చెప్పారు.