కోల్‌కతా నైట్ రైడర్స్ అభిమానులకు (Kolkata Knight Riders fans) స్టార్ బాయ్ గా మారిన రింకూ సింగ్ (Rinku Singh) మరోసారి తన అందరి హృదయాలను గెలుచుకున్నాడు. క్రికెట్ (cricket) ఆటను కొనసాగించడం కష్టంగా ఉన్న పేద యువ ఆటగాళ్ల కోసం ఒక హాస్టల్‌ను నిర్మిస్తున్నాడు. పేదరికాన్ని జయించి ఎదిగిన రింకూ సింగ్ (rinku singh)… ఇప్పుడు ఆర్థికంగా కొంత స్థిరపడ్డాడు. ఇంకా బాగా ఆర్జిస్తున్న ఆటగాడు ఏమీ కాదు. కానీ తనలాంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వర్ధమాన ఆటగాళ్ల కోసం అలీగఢ్ లో హాస్టల్ ను (Rinku Singh Hostel) నిర్మిస్తున్నాడు. ఇందుకు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నాడు. ఆర్థిక వనరులు లేని (poor background) ఆటగాళ్ల కోసం హాస్టల్ ను నిర్మించాలని తాను ఎప్పటి నుండో అనుకుంటున్నానని, ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో హాస్టల్ నిర్మించాలని నిర్ణయించుకున్నట్లు రింకూ చిన్నప్పటి కోచ్ తెలిపాడు. జిల్లా క్రికెట్ సంఘానికి చెందిన 15 ఎకరాల స్థలంలో అలీఘడ్ క్రికెట్ స్కూల్, అకాడమీ నడిపిస్తున్నాడు కోచ్. అక్కడ ఇప్పుడు రింకూ హాస్టల్ నిర్మిస్తున్నాడు.
పద్నాలుగు గదుల హాస్టల్ వర్క్ మూడు నెలల క్రితం ప్రారంభమైందని, ఒక్కో గదిలో నలుగురు ట్రైనీల కోసం సౌకర్యాలు ఉన్నాయని, క్యాంటీన్ లోనే ఫుడ్ తీసుకోవచ్చునని కోచ్ జాఫర్ చెప్పాడు. హాస్టల్ నిర్మాణానికి రూ.50 లక్షలు ఖర్చు అవుతోందని, ఈ మొత్తాన్ని రింకూనే భరిస్తున్నట్లు చెప్పాడు. మరో నెల రోజుల్లో హాస్టల్ నిర్మాణం పూర్తవుతుందని, దీనిని రింకూయే ప్రారంభిస్తాడన్నాడు. ఇప్పటికే ఉన్న తమ ట్రైనీలలో డజను మంది హాస్టల్ కు మారుతారని, వారు ప్రస్తుతం ఉన్న భారీ అద్దెని చెల్లించలేకపోతున్నారని, రింకూ హాస్టల్ లో మాత్రం తక్కువ ధరకే గదులు, ఆహారం పొందవచ్చునని చెప్పాడు. వారు ప్రయాణంలో సమయాన్ని, డబ్బును కూడా వృధా చేయవలసిన అవసరం లేదన్నాడు.
2018లో కోల్ కతా జట్టు రింకూను రూ.80 లక్షలకు కొనుగోలు చేసింది. అప్పటి నుండి అతను ఆ జట్టుకే ఆడుతున్నాడు. 2016లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన అతన్ని ISL జట్టు కింగ్స్ XI పంజాబ్ ఎంపిక చేసింది. కానీ 2018 లో అతను కోల్‌కతా జట్టు రూ.80 లక్షల ధరతో కొనుగోలు చేసింది. అప్పటి నుండి KKR కుటుంబంలో భాగమయ్యాడు.