»Rcbs Defeat Against Gujarat Ipl 2023 Playoff Teams Final
IPL 2023: గుజరాత్ పై ఆర్సీబీ ఓటమి..ప్లే ఆఫ్ టీమ్స్ ఫిక్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు ఈ 2023 IPL సీజన్లో కూడా అభిమానులను నిరాశ పరిచింది. ప్లే ఆఫ్ అవకాశాలను దక్కించుకోవాల్సిన చివరి మ్యాచులో ఆదివారం రాత్రి గుజరాత్(GT) చేతిలో ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిన్న(మే 21న) ఐపీఎల్ 2023.. 70వ మ్యాచులో గుజరాత్ టైటాన్స్(GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో RCB జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది.
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యమైంది. ఆ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(virat kohli) 101 నాటౌట్, కెప్టెన్ డు ప్లెసిస్ 28 రన్స్ మినహా మిగతా ఆటగాళ్లు పెద్దగా స్కోర్ చేయలేదు. ఈ నేపథ్యంలో గుజరాత్ తరఫున బౌలర్ నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.
ఇక తర్వాత 198 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన GT 19.1 ఓవర్లలో 198 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. శుభ్‌మాన్ గిల్ విజయవంతమైన సెంచరీతోపాటు విజయ్ శంకర్ 53 పరుగులు చేసి మ్యాచ్ గెలుపునకు మంచి సపోర్ట్ ఇచ్చారు.
గిల్ 52 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఆర్సీబీ తరఫున మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లి తన ఏడో IPL సెంచరీని నమోదు చేసినప్పటికీ RCB తప్పనిసరిగా గెలవాల్సిన చివరి లీగ్ మ్యాచులో ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ 2023లో గ్రూప్ దశ నుంచి ప్లేఆఫ్‌లు దాదాపు నిర్ణయించబడ్డాయి
1. గుజరాత్ టైటాన్స్
2. చెన్నై సూపర్ కింగ్స్
3. లక్నో సూపర్ జెయింట్స్
4. ముంబై ఇండియన్స్