»Ramachandra Pillai Custody Extension April 3rd 2023 Mlc Kavithas Investigation Is Ongoing
Ramachandra Pillai: కస్టడీ పొడిగింపు..7 గంటలపాటు కొనసాగుతున్న కవిత విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో అరుణ్ రామచంద్ర పిళ్లై(Ramachandra Pillai)కి సీబీఐ(SBI) కోర్టు కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో 14 రోజుల జ్యూడీషియల్ రిమాండును కోర్టు పెంచింది. ఈ క్రమంలో రామచంద్రను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత(MLC kavitha)ను ఈడీ(ED) అధికారులు ఇంకా విచారిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో అరుణ్ రామచంద్ర పిళ్లైకి(Ramachandra Pillai) సీబీఐ(SBI) కోర్టు కస్టడీని ఏప్రిల్ 3వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో 14 రోజుల జ్యూడీషియల్ రిమాండును కోర్టు పెంచింది. ఈ క్రమంలో రామచంద్రను తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు పిళ్లైకి జైలులో థైరాయిడ్ మెడిసిన్, ఐ డ్రాప్స్ సహా ఇతర దుస్తులు ఇవ్వాలని కోర్టు తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో ఆరు గంటలకుపైగా అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రధానంగా సౌత్ గ్రూప్ లావాదేవీలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ఇంకోవైపు ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విచారణ ఎదుర్కొంటున్నారు. ఏడు గంటలపైగా ఈడీ అధికారులు(ED officers) కవితను ప్రశ్నిస్తున్నారు. కన్ ప్రంటేషన్ పద్దతిలో ఆమెను ఈడీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రామచంద్ర పిళ్లై(Ramachandra Pillai), కవితను కలిసి ఈడీ అధికారులు ప్రశ్నించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi excise policy case) అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లై (Arun Ramachandra Pillai) రిమాండ్ రిపోర్టులో (remand report) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) పేరును ప్రస్తావించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate). రామచంద్ర పిళ్లై.. కవితకు బినామీ అని, ఆమె ప్రతినిధినని ఎన్నోసార్లు స్టేట్ మెంట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కవిత ఆదేశాల మేరకు ఆయన పని చేసినట్లు తెలిపింది. ఇండో స్పిరిట్ (Indo Spirits) స్థాపనలో పిళ్లైది కీలక పాత్ర అని వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party) నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ముట్టచెప్పిన సౌత్ గ్రూప్ (South Group) గుప్పిట్లో ఉన్న ఇండో స్పిరిట్ సంస్థలో కవిత (MLC Kalvakuntla Kavitha) తరఫున పిళ్ళై (Arun Ramachandra Pillai) భాగస్వామి అని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో నేరపూరిత ఆర్జన రూ.296 కోట్లుగా ఉండవచ్చునని ఆరోపించింది. ఇందులో కొంత మొత్తాన్ని రామచంద్ర పిళ్లై స్థిర, చరాస్తుల కొనుగోలుకు వినియోగించినట్లు స్పష్టం చేసింది.