భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (brs mlc kalvakuntla kavitha) – ఢిల్లీ లిక్కర్ కేసులో (delhi liquor scam news) కీలకంగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ (sukhesh chandrasekhar) మధ్య వాట్సాప్ చాట్ విడుదలైన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన రావు (bjp mla raghunadan rao) సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుఖేష్ తన లేఖలో తెలంగాణ భవన్ కు (telangana bhavan) డబ్బులు వెళ్లాయని పేర్కొన్నారని, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ (brs party) గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఇందుకు సంబంధించి పూర్తి విచారణ జరిపించాలని కోరారు. రాజకీయ కార్యకలాపాలు జరపాల్సిన ఆఫీస్ లో డబ్బులు చేతులు మారాయని, మనీ లాండరింగ్ కింద విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదనే అంశంపై విచారణ జరపాలన్నారు. తాను ఈసీకి ఫిర్యాదు చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సుఖేష్ – కవిత వాట్సాప్ చాట్ (sukhesh – kavitha whatsapp chat) వెలుగు చూసిన నేపథ్యంలో రఘునందన్ మాట్లాడారు.
ఐదు దఫాలుగా 15 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చాయని సుఖేష్ చెప్పాడని, అది అబద్దమైతే బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు నోరు ఎందుకు మెదపలేదో చెప్పాలన్నారు. బ్లాక్ రేంజ్ రోవర్ కారు (6060 నెంబర్) లో ఇచ్చినట్లు వాట్సాప్ చాట్ లో ఉందని, ఆ కారు నెంబర్ ఎవరిదో రవాణా శాఖ అధికారులు, పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. కారు ఎవరిది… ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నదో తేల్చాలన్నారు. తెలంగాణ భవన్ లోకి కారు నెంబర్ 6060 రాలేదని వీడియో ఫుటేజీని బయట పెట్టగలరా అని సవాల్ చేశారు. పదిహేను కిలోల నెయ్యి అనే పదార్థాన్ని సుఖేష్ ఎన్నిసార్లు ఇచ్చి వెళ్లారో తెలియాలన్నారు. సుఖేష్ లేఖ సంచలనాలకు కేంద్రంగా నిలుస్తోందన్నారు.
కాగా, సుఖేష్ ఇటీవల బాంబు పేల్చిన విషయం తెలిసిందే. డబ్బు ముట్టజెప్పే అంశానికి సంబంధించి కవితతో వాట్సాప్ చాటింగ్ జరిగిందని పేర్కొంటూ పలు వాట్సాప్ స్క్రీన్ షాట్లను అతను షేర్ చేశాడు. ఇది తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ స్క్రీన్ షాట్ లలో కేజ్రీవాల్‌ను AKగా, సత్యేంద్ర జైన్‌ను SJగా కోడ్ నేమ్‌తో చాటింగ్ చేసినట్టు వెల్లడవుతోంది. ఎమ్మెల్సీ కవిత పేరును Kavita Akka TRS తో నంబర్ సేవ్ చేసుకున్నట్టుగా ఉంది.