ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో నేడు సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal)ను సీబీఐ(CBI) అధికారులు విచారించారు. దాదాపు 9 గంటల పాటు సీబీఐ విచారణ సాగింది. విచారణ తర్వాత సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ మీడియాకు అభివాదం చేస్తారు. ఆ తర్వాత తన కారులో ఇంటికి బయల్దేరి వెళ్లారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam)లో సీబీఐ(CBI) అధికారులు కేజ్రీవాల్ కు నోటీసులు(Notices) అందించారు. నోటీసుల మేరకు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. విచారణకు వచ్చే ముందు ఆప్ నేతలు తమ పార్టీ నాయకుడికి సీబీఐ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ నిరసన చేపట్టారు.
నిరసన చేపడుతున్న కొందరు ఆప్ నేతల(AAP Leaders)ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్(Arrest) చేశారు. ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, మంత్రులు సౌరభ భరద్వాజ్, అతిషీ, కైలాశ్ మరికొందరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పార్టీ నేతల(AAP Leaders) అరెస్ట్ నేపథ్యంలో తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ఆప్ నేతలు ఢిల్లీ పార్టీ కన్వీనర్ గోపాల్ రాయ్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.