మనీలాండరింగ్ (money laundering), చీటింగ్ కేసులో (cheating case) ఢిల్లీ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ (sukesh chandrasekhar) ఎవరో తనకు తెలియదని, అతనితో తనకు పరిచయం లేదని, ఎవరో కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు (brs mlc kalvakuntla kavitha). దీనిపై సుకేష్ న్యాయవాది గట్టి కౌంటర్ ఇచ్చారు. తన క్లయింట్ సుకేష్ లేవనెత్తిన వాస్తవాలపై కవిత స్పందన చిన్న పిల్లల ప్రకటనలా ఉందన్నారు. తన వాదనలకు మద్దతుగా తాము అనేక డిజిటల్ సాక్ష్యాలను అందించామని, వాంగ్మూలం కూడా నమోదు చేశామన్నారు. ఈ కేసులో కవిత న్యాయ విచారణనను స్వాగతించడానికి బదులు, కేసు నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. అనుభవజ్ఞుడైన, న్యాయమైన, సరైన రాజకీయ నేత ఎవరైనా ఈ కేసులో విచారణను నిజం తెలిపే ఉద్దేశ్యంలో స్వాగతిస్తారన్నారు. కవిత ప్రతిస్పందన, ఏజెన్సీల నుండి దాగుడు మూతలు ఆడినట్లుగా ఉందన్నారు. ఆమె మాట తీరు బ్లేమ్ గేమ్ లా ఉందన్నారు. ఈ వారంలో తన క్లయింట్ ద్వారా ఈ కేసుకు సంబంధించి వివరణతో కూడిన ప్రతిస్పందన వస్తుందన్నారు.
కవిత – సుకేష్ చంద్రశేఖర్ మధ్య వాట్సాప్ చాట్ వెలుగులోకి వచ్చింది. ఇది తీవ్ర కలకలం రేపింది. దీంతో కవిత స్పందిస్తూ… అసలు సుకేష్ తో తనకు పరిచయం లేదన్నారు. ఎవరో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. పలు మీడియా సంస్థలు ఈ వాట్సాప్ చాట్ గురించి దుష్ప్రచారం చేస్తున్నాయని, ప్రజల్లో బీఆర్ఎస్(BRS) పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఇవన్నీ చేస్తున్నారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవాలను ఏమీ పట్టించుకోకుండా ప్రచారం చేయడం సరికాదన్నారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో చూపిస్తున్నాయన్నారు. క్రిమినల్ సుకేష్ ను పావుగా ఉపయోగించుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను, కుటుంబాన్ని బద్నాం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మేం తెలంగాణ బిడ్డలమని, తలవంచేది లేదని, తెగించి కొట్లాడుతామని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ కూడా చేశారు.