»Delhi Deputy Cm Manish Sisodia Custody Extended April 3rd In Delhi Liquor Scam Case
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని(custody extended) ఢిల్లీ కోర్టు సోమవారం ఏప్రిల్ 3 వరకు పొడిగించింది. అంతకుముందు శుక్రవారం సిటీ కోర్టు సీనియర్ AAP నాయకుడి ED కస్టడీని మార్చి 22 వరకు పెంచింది. అయితే నిందితుడిని సమర్థవంతమైన విచారణ కోసం భౌతిక కస్టడీ అవసరమని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో సీబీఐ విచారణలో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 3 వరకు పొడిగించారు. 14 రోజుల పాటు పొడిగిస్తూ ఢిల్లీలోని అవెన్యూ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిసోడియా పాత్రపై సీబీఐ(CBI), ఈడీ)ED) విచారణ చేస్తోంది. ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అయితే రెండ్రోజుల తర్వాత మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఈడీ అతడిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన మార్చి 22 వరకు ఈడీ రిమాండ్(remand)లో ఉన్నారు.
2021-22కి సంబంధించి ఇప్పుడు రద్దు చేయబడిన ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ(Delhi liquor scam case) రూపకల్పన అమలులో అవినీతికి సంబంధించి సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడి వాంగ్మూలాన్ని మార్చి 7న సుమారు ఐదు గంటలపాటు నమోదు చేసింది.
మద్యం వ్యాపారులకు లైసెన్సులు మంజూరు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ విధానం కార్టెలైజేషన్ను అనుమతించిందని, కొంతమంది డీలర్లకు అనుకూలంగా ఉందని ఆరోపించింది. ఆ క్రమంలో వారు లంచాలు చెల్లించారని తెలిపింది. ఈ అభియోగాన్ని AAP ఖండించింది. ఈ విధానం తర్వాత రద్దు చేయబడిందని ఢిల్లీ LG సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. దీని తర్వాత ED అదే నిందితులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది.
ఈ కేసుకు సంబంధించి వ్యాపారవేత్తలు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లితో పాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ(CBI) గతేడాది నవంబర్ 25న చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ మద్యం వ్యాపారులకు లైసెన్సుల మంజూరుకు ఉద్దేశించి లంచం ఇచ్చిన కొందరు డీలర్లకు అనుకూలంగా ఉందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.