»Sc Gives Deadline To Centre Pay Arrears To Pensioners Gallantry Winners Of Armed Forces
One Rank One Pension: మోదీ సర్కార్కు షాక్..ఆ డబ్బులు వెంటనే ఇవ్వాలంటూ ఆదేశాలు
సుప్రీం కోర్టు(Supreme Court) కేంద్ర సర్కారుకు షాక్ ఇచ్చింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్(One Rank One Pension) ఎరియర్స్ పేమెంట్ విషయంలో మోదీ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. మాజీ సైనికుల(Ex servicemen)కు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ బకాయిల చెల్లింపుపై కేంద్రం ఇచ్చిన సీల్డ్ కవర్ నోట్ ను సుప్రీం స్వీకరించలేదు. మాజీ సైనికులకు వెంటనే ఎరియర్స్ డబ్బులు ఇవ్వాలని, అందుకు గడువును కూడా నిర్దేశించింది.

2019-22 సంవత్సరాలకు సంబంధించి మాజీ సైనికులకు(Ex servicemen) కేంద్రం రూ.28,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దానికి సంబంధించిన గడువును ఇస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవలె సుప్రీంలో అఫిడవిట్ ను దాఖలు చేసింది. అయితే దీనిపై తాజాగా సుప్రీం కీలక తీర్పునిచ్చింది. అర్హత కలిగిన ఫ్యామిలీ పెన్షనర్లకు, సాయుధ దళాలకు ఎరియర్స్ ను చెల్లించాలని కోరింది.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్(One Rank One Pension) స్కీమ్ ప్రకారంగా ఏప్రిల్ 30వ తేది లోపు వారందరికీ చెల్లింపులు చేయాలని ఆదేశించింది. మాజీ సైనికుల్లో అర్హత కలిగిన పెన్షనర్లకు 70 ఏళ్లకు పైన వయసుంటే వారికి జూన్ 30లోగా పేమెంట్ చేయాలని తెలిపింది. మిగతా అర్హులకు కూడా ఆగస్టు 30, నవంబర్ 30, 2024 ఫిబ్రవరి 28వ తేదిలోపు విడతల వారీగా చెల్లింపులు చేయాలని గడువును నిర్దేశించింది.