»Pt Usha Chairs Rajya Sabha Proceedings For The First Time
Rajya Sabha చైర్మన్ స్థానంలో పరుగుల రారాణి పీటీ ఉష
సమాజంతో పోటీ పడి అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకాన్ని రెపరెపలాడించిన భారతదేశ పరుగుల రారాణి పీటీ ఉష. భారతదేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో ఆసీనురాలైంది. రాజ్యసభ చైర్మన్ స్థానంలో పీటీ ఉష కూర్చున్నారు. సభా వ్యవహారాలను కొద్దిసేపు నిర్వహించి ఆకట్టుకున్నారు.
ఆమె పరుగు పందెంలో రారాణి. పరుగుల పోరాటంలో అమ్మాయిలు ఉరకగలరా అని ప్రశ్నలు వెలువెత్తుతున్న సమయంలోనే ఆమె పరుగు మొదలుపెట్టింది. పురుషులతో సమానంగా పరుగు పందెంలో రాణించింది. నాటి కాలంలో ఓ అమ్మాయి పొట్టి బట్టలు వేసుకుని పరుగు పెడితే సమాజం అంగీకరించదు. అయినా సమాజంతో పోటీ పడి అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకాన్ని రెపరెపలాడించిన భారతదేశ పరుగుల రారాణి పీటీ ఉష. భారతదేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో ఆసీనురాలైంది. రాజ్యసభ చైర్మన్ స్థానంలో పీటీ ఉష కూర్చున్నారు. సభా వ్యవహారాలను కొద్దిసేపు నిర్వహించి ఆకట్టుకున్నారు.
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ లేకపోవడంతో ఆ స్థానంలో పీటీ ఉష కూర్చుని సభా కార్యక్రమాలను నిర్వహించారు. పయ్యోలీ ఎక్స్ ప్రెస్ గా ఖ్యాతి పొందిన ఉష అత్యున్నత కుర్చీలో కూర్చోవడంపై ఉబ్బితబ్బిబైంది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా పంచుకుంది. ఫ్రాంక్లిన్ డి.రూజ్ వెల్ట్ చెప్పినట్టు.. గొప్ప స్థానం ఇంకా గొప్ప బాధ్యతను కలిగి ఉంటుంది. రాజ్యసభ కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు నాకు అలాంటి భావన కలిగింది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకంతో ఈ ప్రయాణంలో మరింత పరిణితి సాధిస్తా’ అంటూ ట్వీట్ చేసింది. ఒక వీడియోను కూడా పొందుపరించింది. రాజ్యసభ చైర్మన్ స్థానంలో కూర్చుంటున్న వీడియోను పంచుకుంది.
"Great power involves great responsibility" as said by Franklin D. Roosevelt was felt by me when I chaired the Rajya Sabha session. I hope to create milestones as I undertake this journey with the trust and faith vested in me by my people. 🎥 @sansad_tvpic.twitter.com/bR8wKlOf21
ఆ స్థానంలో కూర్చునే అర్హత ఎవరికి ఉంది?
రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేని పక్షంలో సభా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక కమిటీ ఉంటుంది. వారిద్దరూ సభలో లేని పక్షంలో వైస్ చైర్ పర్సన్స్ కమిటీ ఒకటి ఉంటుంది. ఆ కమిటీలోని సభ్యులు చైర్మన్ స్థానంలో కూర్చోవచ్చు. సభ్యుల్లో ఎవరో ఒకరు సభా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించవచ్చు. గతంలో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి చైర్మన్ స్థానంలో కూర్చుని సభా కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
కేరళకు చెందిన పీటీ ఉష ఆసియా గేమ్స్ లో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించింది. ఆసియా క్రీడలు, ఏషియన్ చాంపియన్ షిప్, వరల్డ్ జూనియర్ ఇన్విటేషనల్ మీట్ లలో పాల్గొని సత్తా చాటింది. భారత్ నుంచి మహిళా స్ప్రింటర్ గా బరిలోకి దిగి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 1984 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్ లో 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో నాలుగో స్థానంలో నిలిచింది. త్రుటిలో పతకాన్ని చేజార్చుకుంది. 2022 జూలైలో భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యింది. రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ గా ఉష కొనసాగుతున్నది.
అరుదైన రికార్డు సొంతం
భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలిగా ఉష నియమితురాలై చరిత్ర సృష్టించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్ దిగ్గజంగా ఉన్న ఉష ఐఓఏ చైర్ పర్సన్ గా ఉన్న కాలంలోనే భారతదేశాన్ని గ్లోబల్ స్పోర్ట్స్ సూపర్ పవర్ గా మారుస్తానని ప్రకటించింది. ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు కృషి చేస్తానని చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పీటీ ఉష తెలిపింది.