Prime Minister Sanna Marin of Finland who announced divorce from her husband
ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్ తన భర్త మార్కస్ రైకోనెన్‌తో కలిసి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బుధవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. తాము 19 సంవత్సరాలు కలిసి ఉన్నందుకు..ఓ ఐదేళ్ల కుమార్తె ఉందని పేర్కొన్నారు. తమ కుమార్తె కోసం ఒక ఫ్యామిలీగా ఉంటామని వెల్లడించారు. దీంతోపాటు తాము మంచి స్నేహితులుగా ఉంటామని వారిద్దరు వేర్వేరు ఇన్స్టాగ్రామ్ కథనాలలో ప్రకటించారు. అయితే 2020లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
37 ఏళ్ల మారిన్ ఆమె 2019లో అధికారం చేపట్టినప్పుడు ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన ప్రధాన మంత్రిగా గుర్తింపు సాధించారు. కరోనా సమయంలో ఎన్ని విధానాలకు అమలు చేసి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులను దక్కించుకున్నారు. ప్రగతిశీల కొత్త నాయకులకు సహస్రాబ్ది రోల్ మోడల్‌గా నిలిచారు కూడా. అయితే ప్రభుత్వ ధనం ఖర్చు, పార్టీలలో పాల్గొనడం పట్ల మారిన్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తన పదవికి సైతం రాజీనామా చేశారు. కానీ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు మారిన్ తన బాధ్యతలు నిర్వహిస్తారు.
ఏప్రిల్‌లో 200 సభ్యుల పార్లమెంటులో మారిన్ యొక్క సోషల్ డెమోక్రాట్లు 43 స్థానాలతో మూడవ స్థానానికి పడిపోయారు. సంప్రదాయవాద జాతీయ కూటమి 48 స్థానాలతో, ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక ఫిన్స్ పార్టీ 46 స్థానాలతో తొలి స్థానాల్లో ఉన్నారు. మరోవైపు జాతీయ కూటమి ప్రస్తుతం ఫిన్స్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతోంది.