ప.గో: మాతృశ్రీ బలుసులమ్మ వారి జాతర మహోత్సవాల్లో ఆరో రోజు సోమవారం పంచ గావ్యాలు, పంచ ద్రవ్యాలతో అమ్మవారికి అవబృత స్నానం చేయించేందుకు సువాసినిలు, ముత్తైదువులు కలశాలతో జలాలను తీసుకువచ్చారు. తొలుత గొల్లగూడెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి ఊరేగింపుగా.. బలుసులమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం పూజలు చేసి అవబృత స్నానం చేయించి అలంకరణ చేశారు.