»Pawan Kalyan Star Og Movie Costly Statements On Blue Colour T Shirt
Pawan kalyan: OG చాలా కాస్ట్లీ.. ఆ బ్రాండ్స్ రేట్ ఎంతో తెలుసా!?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan) నటిస్తున్నా సినిమాల్లో ఓజి(OG)పై భారీ అంచనాలున్నాయి. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అందుకు తగ్గట్టే ఈ ప్రాజెక్ట్ నుంచి నుంచి కాస్ట్లీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మేకర్స్. అంతే కాదు.. పవన్‌ను కూడా చాలా కాస్ట్లీగా చూపిస్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్‌గా లేటెస్ట్ వైరల్ లుక్ అని చెప్పొచ్చు. ఈ లుక్‌లో పవన్ వాడినా బ్రాండ్స్ అండ్ వాటి రేటు.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్న భారీ యక్షన్ చిత్రం ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్(OG)’. ప్రస్తుతం ఓజి వర్కింగ్ టైటిల్‌తో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సాహో తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ముంబై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్ వార్‌ను క్రియేట్ చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
రీసెంట్‌గానే ముంబై(mumbai)లో భారీ యాక్షన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా పవన్‌కు సంబంధించిన ఓ లుక్‌ని పోస్ట్ చేశారు. ఈ లుక్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ఎలా ఉంటాడో చెప్పడానికి జస్ట్ శాంపిల్‌లా ఉందనే చెప్పాలి. బ్లూ కలర్ టి షర్ట్, బ్లాక్ కలర్ గ్లాసెస్‌తో చాలా స్టైలిష్‌గా ఉన్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలో పవన్ ధరించిన టీషర్ట్, సన్ గ్లాసెస్ పై ఎక్కువగా చర్చ నడుస్తోంది.
పవర్ బ్రాండ్ వేసుకున్న టీషర్ట్(blue colour t shirt), సన్ గ్లాసెస్ రేట్ ఎంతై ఉంటుందని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో వాటి బ్రాండ్, రేట్ పట్టేశారు అభిమానులు. పవన్ వేసుకున్నది హ్యూగో బాస్ టీషర్ట్.. దీని కాస్ట్ వచ్చేసి సుమారు 11 వేల వరకు ఉంటుందని అంటున్నారు. ఇక సన్ గ్లాసెస్ మాంట్ బ్లాంక్ బ్రాండ్ కు చెందినట్టుగా చెబుతున్నారు. దీని ధర వచ్చేసి దాదాపు 24,000 వరకు ఉంటుందని తెలుస్తోంది.
దీంతో పవర్ స్టార్ అంటే.. ఆ మాత్రం ఉండాల్సిందేనని అంటున్నారు అభిమానులు(fans). ఇక ఓజిలో పవన్ మొత్తం మూడు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తాడట. యువకుడుగా, మధ్య వయస్కుడిగా.. కొంచెం ఏజ్ వచ్చే డాన్ పాత్రలో కనిపించనున్నాడట. మొత్తంగా ఓజి మాత్రం కాస్ట్లీ స్టేట్మెంట్స్తో రోజు రోజుకి అంచనాలను పెంచేస్తున్నాడు.