అధికార యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్నికలకు సమయం దగ్గరికి వస్తుండడంతో ఈలోపే అధికార యంత్రాంగానికి పూర్తి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్, ఐఏఎస్ లతో పాటు అన్ని శాఖల్లోనూ పదోన్నతులు, బదిలీలు చేపడుతోంది. ఇప్పటికే ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొందరు అధికారులకు పదోన్నతులు కల్పించింది...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశాలు రావొచ్చునని, కాబట్టి వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ రాష్ట్రానికి వెళ్లాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మంగళవారం హితవు పలికారు. తెలంగాణ బడ్జెట్ పైన షర్మిల మాట్లాడటం బాధాకరమన్నారు. జగన్ జైలులో ఉన్న సమయంలో ఆమె పాదయాత్ర చేశారని, కానీ అలాంటి సోదరికి ఆయన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి షర్మిల తనకు జరిగిన...
నిండా పద్దెనిమిదేళ్లు కూడా నిండలేదు. వందల కోట్లకు పడగలెత్తింది. పుట్టిన రోజు కోసం ఏం కొందామో తెలియక పొరపాటున కొన్న లాటరీ టికెట్ ఆమెను కోటీశ్వరాలిని చేసేసింది. తాత చెప్పిన మాటతో కొన్న లాటరీ టికెట్ తో ఆమెకు రూ.290 కోట్లు దక్కాయి. అదృష్టమంటే ఈ అమ్మాయిదే కదా. అయితే వచ్చిన ఆ డబ్బుతో ఆమె మెర్సిడెస్ బెంజ్ కార్లు, అత్యంత విలాసవంతమైన బంగ్లా కొనడంతో పాటు భవిష్యత్ దృష్ట్యా కొన్ని కోట్లు పెట్టుబడిగా పెట్టే...
హిండెన్ బర్గ్ వ్యవహారం నేపథ్యంలో అదానీ గ్రూప్ కకావికలమవుతోంది. ఈ కంపెనీ షేర్లు భారీగా పడిపోయాయి. ఈ వారం పది రోజుల్లోనే షేర్లు మూడింతలు నష్టపోయాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద లక్షల కోట్లు కరిగిపోయింది. ఈ వ్యవహారం పార్లమెంటును కూడా కుదిపేస్తోంది. అదే సమయంలో హిండెన్ బర్గ్ విశ్వసనీయత పైన కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు మరో విషయాన్ని వెల్లడించాయి. అదానీ గ్రూప్‌కు రుణాల...
అదానీ ఎదుగుదలలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని, ఆయన కోసం నిబంధనలు కూడా మార్చారని ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. అదానీ వ్యవహారం గత కొద్దిరోజులుగా హాట్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ అంశంపై సభలో మాట్లాడారు. మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే తక్కువకాలంలో ప్రపంచ కుబేరుడయ్యాడని ఆరోపించాడు. దీనిపై బీజేపీ నేత రవిశంకర ప్రసాద్ ఘాటుగా ...
యువ నటుడు కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా మారాడు. జయపజయాలు పక్కన పెట్టి వరుస సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఈనెల 17న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఇద్దరి ఇష్టాలు ఒక్కటైతే.. ఫోన్ నంబర్ ఇతివృత్తంలో ఈ సినిమా తెరకెక్కినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ను సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదలైంది. చదవ...
టర్కీ, సిరియాలలో భారీ భూకంపం కారణంగా వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నోవేల మందికి గాయాలయ్యాయి. భూకంపం దాటికి ఈ దేశాలు కకావికలమయ్యాయి. భవనాలు కుప్పకూలాయి. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు, చనిపోయినవారిని తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. కూలిపోయిన భవనాల కింద వేలాదిమంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి పరిస...
తెలంగాణ విద్యార్థులు అలర్ట్ కావాలి. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయి. ఉన్నత విద్య చదవాలంటే ప్రవేశ పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిందే. ఉమ్మడి పరీక్షల్లో మంచి ర్యాంకు సాధిస్తే అత్యుత్తమ కళాశాలల్లో సీట్లు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఎంసెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్ సెట...
శ్రద్ధావాకర్ బాడీని 17 ముక్కలు చేసినట్లు నిందితుడు అప్తాప్ విచారణలో అంగీకరించినట్లు ఛార్జీషీట్‍లో పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పోలీసులు 6600 పేజీలతో సుప్రీం కోర్టుకు ఛార్జీషీటును సమర్పించారు. ఇందులోని పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధను హత్య చేశాక అప్తాబ్ ఆమె ఎముకలను స్టోన్ గ్రైండర్‌తో పొడి చేసి దానిని దూరంగా విసిరేశాడు. చిట్టచి...
‘అవును సినిమాలంటేనే వ్యాపారం.. ప్రజలకు నీతి వాక్యాలు చెప్పేందుకు తీయం’ అని సినీ నిర్మాత, నటుడు కొణిదెల నాగబాబు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. సినిమాల వలన ప్రజలు బాగు పడతారని.. చెడిపోతారని తాను భావించట్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్ లో రెండు పోస్టులు చేశారు. ఎవరినో ఉద్దేశించి పరోక్షంగా.. ఘాటుగా నాగబాబు స్పందించారు. కుహన మేధావులు అని ఆ వ్యక్తిని విమర్శించారు. చదవండి: అమెరికాలో తుపాకీ ...
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ… తన కొత్త ఫోన్ పోగొట్టుకున్నాడు. కొత్త ఫోన్.. కనీసం అన్ బాక్సింగ్ కూడా చేయలేదు. ఆలోపే పోయింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. అయితే… ఆయన ట్వీట్ కి జొమాటో ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం విశేషం. ‘కనీసం కొత్త ఫోన్ ను అన్ బాక్స్ కూడా చేయకుండానే పోగొట్టుకోవడం కంటే బాధాకరమైన విషయం మరొకటి ఉండదు. మీరు ఎవరైనా ఆ ఫోన్...
మహేష్, రాజమౌళి కాంబో పై ఎలాంటి అప్డేట్ వచ్చినా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఆర్ఆర్ఆర్‌తో రాజమౌళి హాలీవుడ్ రేంజ్‌కు వెళ్లిపోవడంతో.. మహేష్ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. పైగా ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్‌గా, ఇండియానా జోన్స్ తరహాలో తెరకెక్కిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చేశాడు జక్కన్న. అందుకే ఒక్క మహేష్ ఫ్యాన్సే కాదు.. యావత్ సినీ ప్రపంచం ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. అయితే ఈ ...
మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డబుల్ డెక్కర్ బస్సులు భాగ్యనగరంలో సందడి చేస్తున్నాయి. మొత్తం మూడు బస్సులను మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్ బస్సులను నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. బస్సుల ప్రారంభోత్సవానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ కుమార్, ఎం...
తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని రోజా హెచ్చరించారు. కనీసం అర కిలోమీటర్ సక్రమంగా నడవలేక, వంకర టింకరగా నడిచే నువ్వు కూడా 3600 కిలోమీటర్లు నడిచిన జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, అభివృద్ధి కనిపిస్తోందన్నారు. అందుకే టీడీపీ ఈ మధ్య కొత్త రాగం అందుకున్నదని చెబుతున్నారన్నారు. మేం అధికారంలోకి వచ్చినా ...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. పిటిషన్ వెంటనే విచారణకు స్వీకరించాలని న్యాయవాది దుష్యంత్ దవే కరోరారు. కేసును సీబీఐకి అప్పగిస్తే సాక్ష్యాలు ధ్వంసమవుతాయని పేర్కొన్నారు. అయిత...