తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు.. రిక్రూట్ మెంట్ బోర్డు(telangana police recruitment board) నిర్వహించిన ఈవెంట్స్ టెస్టుల్లో భాగంగా పలువురు తాము హైట్(height) ఉన్నా కూడా దాదాపు 1 సెంటీమీటర్ తక్కువగా చూపించి తమను డిస్ క్వాలిఫై చేశారని పలువురు హైకోర్టును(telangana high court) ఆశ్రయించారు. దీంతో ఒక సెంటీమీటర్ కంటే తక్కువగా ఉండి డిస్ క్వాలిఫై చేసిన అభ్యర్థులకు మళ్లీ హైట్ ను కొలవాలని హైకోర్టు పోలీస...
గౌతమ్ అదానీతో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నిసార్లు కలిసి ప్రయాణించారు? అతనిని మీరు ఎన్నిసార్లు కలిశారని తాను ప్రశ్నలు అడిగానని, కానీ లోకసభలో అంతసేపు మాట్లాడిన ప్రధాని తన ప్రశ్నలకు జవాబులు మాత్రం ఇవ్వలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న తన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి (Revanth Reddy) సమర్థించుకున్నారు. తాను తప్పుగా మాట్లాడలేదని, ప్రజల సొమ్ముతో దానిని నిర్మించారని, ఇది అందరికీ అందుబాటులో ఉండాలన్నారు.
మంత్రివర్గ సమావేశంలోనూ రాజధాని అంశమే ప్రధానంగా చర్చించారు. విశాఖలో చేయాల్సిన పనులు, తరలించాల్సిన కార్యాలయాలు వంటి వాటిపైనే చర్చలు చేశారు. పెండ్లి కానుకల పథకాలైన కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలను ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.
ప్రధాని మోడీ జాతీయవాదం ముసుగులో దాక్కున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. మోడీ పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పారన్నారు. పార్లమెంటులో అదానీ వ్యవహారంపై నరేంద్ర మోడీ మాట్లాడలేదన్నారు.
తెలంగాణకు మోడీ ప్రభుత్వం ధోఖా ఇచ్చిందని దుయ్యబట్టారు. రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను తూర్పారబట్టారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన చర్చలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మరో సత్యవతి రాథోడ్ తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
అక్షయ్ కుమార్‌తో రిలేషన్-ఎంగేజ్‌మెంట్-బ్రేకప్ క్షణాలను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నట్లు పేర్కొన్నది బాలీవుడ్ నటి రవీనా టాండన్. అయితే అక్షయ్ జీవితం నుండి తాను అప్పుడే బయటకు వచ్చినట్లు చెప్పింది.
టర్కీ (Turkey), సిరియా(Syria) ప్రాంతాల్లో భారీ భూకంపం(Earthquake) సృష్టించిన విలయంతో ఆ ప్రదేశం అంతా శవాట గుట్టలుగా మారింది. ఇప్పుడు టర్కీలో ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తాయి. వేలాది భవనాలు కుల్పకూలి సమాధులను తలపిస్తున్నాయి.
ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ట్విస్ట్. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, కాల్ రికార్డింగ్ మాత్రమేనని బయటకు వచ్చాడు ఎమ్మెల్యే స్నేహితుడు, ప్రముఖ కాంట్రాక్టర్ రామశివారెడ్డి.
పాదయాత్రలపై జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు మన తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు కీలక పాత్ర పోషిస్తాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ వీరంతా పాదయాత్ర లు చేసిన తర్వాత.. సీఎం పదవి దక్కించుకున్నవారే.
అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల నుంచి రాజధాని ప్రాంతవాసులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. న్యాయస్థానాలు కూడా అమరావతికే మొగ్గు చూపగా సీఎం జగన్ కక్షపూరితంగా రాజధానిని విశాఖను మారుస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఒకటేనని, అది కూడా అమరావతి అని నారా లోకేష్ కుండబద్దలు కొట్టారు. రాజధాని మాత్రమే ఒక్కటి అని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ తమ లక్ష్యమని చెప్పారు. సూటిగా కళ్లలోకి చూడలేని నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు.
2004 నుండి 2014 కాలంలో కాంగ్రెస్(Congress) పాలనలో భారత్ అవినీతిమయమైందని, 2జీ స్కామ్ నుండి మొదలు పెడితే కామన్వెల్త్ స్కామ్ వరకు ఎన్నో వెలుగు చూశాయని ప్రధాని నరేంద్ర మోడీ లోకసభలో మండిపడ్డారు.
ప్రగతి భవన్ ని పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీలు అందరూ కలిసి డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
రిషబ్ పంత్ లేకపోతే టీమిండియా బలం తగ్గిందని, అతను త్వరగా పూర్తిగా కోలుకొని రావాలని, ఆ తర్వాత ఆయనను చెంపదెబ్బ కొడతానని చెప్పాడు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్(Kapil Dev).