»Young Director Joseph Manu James Passed Away With Hepatitis
Nancy Rani యువ దర్శకుడు హఠాన్మరణం.. సినిమా రిలీజ్ కాకుండానే
ఎప్పటికైనా తాను ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని కలలు గన్నాడు. ఈ క్రమంలో ‘నాన్సీ రాణి’ అవకాశం దక్కింది. సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలోనే అతడు మృతి చెందడం కలచి వేస్తోంది. భారతీయ సినీ పరిశ్రమకు కాలం కలిసి రావడం లేదు.
భారతీయ సినీ పరిశ్రమకు కాలం కలిసి రావడం లేదు. దిగ్గజాలతో పాటు ఇటీవల వెండితెరకు పరిచయమవుతున్న వాళ్లు హఠాన్మరణం పొందుతున్నారు. ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమకు రాగా గుండెపోటు, అనారోగ్యంతో నటీనటులతో పాటు 24 క్రాఫ్ట్స్ (24 Crafts)కు చెందిన వారు మృతి చెందుతున్నారు. ఆదివారం కళాతపస్వి కె.విశ్వనాథ్ (K.Vishwanath) సతీమణి జయలక్ష్మి (Jayalakshmi) కన్నుమూసిన విషయం మరువకముందే మరో యువ దర్శకుడు తుదిశ్వాస విడిచాడు. ఎంతో భవిష్యత్ ఉండగానే ఆకస్మిక మరణం పొందడంతో మలయాళ సినీ పరిశ్రమ (Mollywood) విషాదంలో మునిగింది.
కేరళ (Kerala)కు చెందిన యువ దర్శకుడు (Young Director) జోసెఫ్ మను జేమ్స్ (31) (Joseph Manu James). కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆదివారం రాత్రి పరిస్థితి విషమించడంతో జేమ్స్ కన్నుమూశాడు. మను జేమ్స్ ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించాడు. తొలి సినిమా ‘నాన్సీ రాణి (Nancy Rani)’ తెరకెక్కిస్తున్నాడు. అహనా కృష్ణ, ధ్రువన్, అజు వర్గీస్, లాల్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్స్ (Post Productions) పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అతడు మరణించడంతో సినిమా బృందం దిగ్భ్రాంతికి గురయ్యింది.
బాల నటుడిగా జోసేఫ్ మను జేమ్స్ పలు సినిమాల్లో నటించాడు. సాబు జేమ్స్ దర్శకత్వంలో 2004లో విడుదలైన అయామ్ క్యూరియస్ (I am Curious) సినిమాలో మను జేమ్స్ నటించి మెప్పించాడు. అనంతరం మలయాళం (Malayalam), కన్నడ (Kannada), హిందీ (Bollywood) సినిమాల్లో సహాయ దర్శకుడిగా మను జేమ్స్ పని చేశాడు. ఎప్పటికైనా తాను ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని కలలు గన్నాడు. ఈ క్రమంలో ‘నాన్సీ రాణి’ అవకాశం దక్కింది. సినిమా పూర్తయి విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలోనే అతడు మృతి చెందడం కలచి వేస్తోంది. కాగా మను జేమ్స్ మృతికి మలయాళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మను జేమ్స్ మృతికి మలయాళ సినిమా సీనియర్ నటులు శ్రీనివాసన్, లాల్, లీనా, ఇంద్రన్, అజు వర్గీస్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. త్వరగా వెళ్లిపోయావ్ సోదరా అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. కాగా మను జేమ్స్ హెపటైటిస్ (Hepatitis) వ్యాధితో బాధపడుతుండేవాడని సమాచారం.