మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉదయం ఏడు గంటలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యింది (Meghalaya, Nagaland Assembly polls). ఈ రెండు రాష్ట్రాల్లో 59 చొప్పున అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రెండు రాష్ట్రాల్లో 34 లక్షల మంది ఓటర్లు ఉండగా, 552 మంది బరిలో నిలిచారు.
మేఘాలయలో 369 మంది పోటీలో ఉన్నారు. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) మరోసారి తామే గెలుస్తామని, మేజిక్ ఫిగర్ 30 సీట్లు క్రాష్ చేస్తామని ధీమా వ్యక్తం చేసింది. భారతీయ జనతా పార్టీ BJP) నుంచి గట్టి పోటి నెలకొంది. గతంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ పాలన సాగించింది. మేఘాలయలో మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కన్నేసింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా పోటీలో నిలవడం అధికార పార్టీని ఇబ్బంది పెడుతోంది. నాగాలాండ్ లో 59 అసెంబ్లీ స్థానాల్లో 183 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (NDPP) బీజేపీతో పొత్తుతో వెళ్తోంది. ఎన్డీపీపీ 40 స్థానాల్లో, బీజేపీ 20 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ 23, 22 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
మేఘాలయ, నాగాలాండ్ ప్రజలను, ముఖ్యంగా యువకులు మొదటిసారి ఓటు హక్కు పొందిన ఓటర్లు రికార్డు సంఖ్యలో ఓట్లు వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్లో(Tweet) కోరారు.