MBNR: ఈ నెల 24న కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. కొడంగల్‌లో గెలిచిన సర్పంచ్ లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. సర్పంచ్‌లతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశం అనంతరం సీఎం సర్పంచ్‌లతో కలిసి లంచ్ చేస్తారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.