Pawan Kalyan : మెడికల్ విద్యార్థిని ప్రీతి మరణం తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలచివేసింది. సీనియర్ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దాదాపు ఐదు రోజుల పాటు పోరాడి.. చివరకు ప్రాణాలు కోల్పోయింది. నేడు ప్రీతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మెడికల్ విద్యార్థిని ప్రీతి మరణం తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా కలచివేసింది. సీనియర్ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దాదాపు ఐదు రోజుల పాటు పోరాడి.. చివరకు ప్రాణాలు కోల్పోయింది. నేడు ప్రీతి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా…. ఈ ఘటనపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రీతి మరణం బాధాకరమైన విషయమని పేర్కన్నారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి మరణించిన ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రీతి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రీతి మరణానికి కారణమైన నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజీలో ర్యాగింగ్ సంస్కృతి పెరిగిపోతున్నదని, ముఖ్యంగా ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో ఈ సంస్కృతి పెరుగుతున్నట్లు పవన్ పేర్కొన్నారు. జూనియర్ల పట్ల సీనియర్లు ప్రవర్తిస్తున్న తీరు మారాలని అన్నారు.
మెడికో ప్రీతిని సీనియర్ సైఫ్ వేధిస్తున్నాడని ఆమె తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపొవడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకొని ఉంటే ఈరోజున ప్రీతి ఆత్మహత్యకు పాల్పడేది కాదని అన్నారు. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీనియర్లు జూనియర్ల పట్ల స్నేహభావంతో, సోదర భావంతో మెలగాలని, అలా కాకుండా ర్యాగింగ్ పేరుతో దుశ్చర్యలకు పాల్పడితే వారి జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. ఐదు రోజులపాటు మృత్యువుతో పోరాడి మృతి చెందిన ప్రీతి మృతదేహాన్ని అధికారులు ఆమె స్వగ్రామమైన మొండ్రాయి గిర్ని తండ్రాకు తరలించారు. నేడు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.