»Women Delivery In Godavarikhani Peddapalli And Cut In The Stomach
Doctors Negligence: దారుణం డెలివరీ చేసి కడుపులోనే కత్తెర
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ఆపరేషన్ చేసిన మహిళా డాక్టర్ కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. గత ఐదేళ్లుగా నరకం అనుభవించిన మహిళ ఇటీవల స్కాన్ చేయించుకోగా అసలు విషయం తెలిసింది.
ఇటివల కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఆస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే వ్యాధుల బారినుంచి ప్రజలను కాపాడాల్సిన వైద్యులే నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణపాయ పరిస్థితులకు గురిచేస్తున్నారు. అలాంటి సంఘటనే తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి(peddapalli) జిల్లా గోదావరిఖని(Godavarikhani)లో వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల క్రితం డెలివరీ కోసం ఓ మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా మహిళా డాక్టర్ సర్జరీ(surgery) చేసి కత్తెరను కడుపులోనే మర్చిపోయింది. దీంతో ఐదేళ్లపాటు కత్తెర ఆ మహిళ పొట్ట(stomach)లోనే ఉండింది.
ఆ క్రమంలో తర్వాత ఆమెకు పలు మార్లు కడుపునొప్పి(stomach) వచ్చింది. కానీ సాధారణ నొప్పి అనుకుని మాత్రలు వేసుకుంది. అయినా తగ్గకపోవడంతో పలువురు వైద్యుల వద్దకు వెళ్లి చూపించుకుంది. అయినా పరిస్థితిలో ఏ మార్పు లేకపోవడంతో హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లీ సిటీ స్కానింగ్(ct scan) చేయించుకుంది. దీంతో ఆమె కడుపులో ఓ కత్తెర ఉన్నట్లు రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు వెల్లడించారు. దీంతో సమాచారం తెలుసుకున్న ఆ మహిళ కుటుంబ సభ్యులు అప్పుడు ఆపరేషన్ చేసిన ఆస్పత్రికి వెళ్లి వైద్యురాలిని(doctor) నిలదీశారు. ఆ నేపథ్యంలో తన తప్పు తెలుసుకున్న మహిళా డాక్టర్(doctor) కత్తెర తొలగించేందుకు అయ్యే ఖర్చులు సహా ఆస్పత్రి ఖర్చు కూడా ఇస్తామనడంతో బాధిత కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు.
ఆ డాక్టర్ చేసిన చిన్న తప్పు వల్ల ఆ మహిళ దాదాపు ఐదు సంవత్సరాలు(5 years) కడుపునొప్పితో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయి. అయినా కూడా వైద్యుల తీరులో మార్పు రావడం లేదు. మళ్లీ అదే నిర్లక్ష్యంతో ఆపరేషన్లు(surgery) చేస్తూ పలువురిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరోవైపు అచ్చం ఇలాంటి సంఘటనే తాజాగా కేరళలో కూడా చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఆమెకు ఏమి జరుగలేదు. కానీ ఒకవేళ ఏదైనా జరిగితే వారి కుటుంబం పరిస్థితి ఏంటీ? ఇలాంటి వైద్యులను ఏం చేయాలి? ఇలాంటివి మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పులు చేసిన వారికి ఎలాంటి శిక్ష వేయాలో కామెంట్(comment) రూపంలో తెలియజేయండి.