»Peddapalli Mla Dasari Manohar Reddy Grabbed The Temple Lands
MLA: ఆలయ భూములు కబ్జా చేసిన ఎమ్మెల్యే..హైకోర్టు నోటీసులు !
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏకంగా ఆలయ భూములపై కన్నేశారు. అంతటితో ఆగకుండా తన పేరు మీద చేయించుకొని దేవుడికే అన్యాయం చేశారు. ఈ విషయం కోర్టుకు చేరడంతో ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
Peddapalli MLA Dasari Manohar Reddy grabbed the temple lands
Possession: అధికారం(authority) అడ్డం పెట్టుకొని ప్రజలను వేధించేవారిని ఎంతో మందిని చూశాము. అలాగే దేవుడి(god) పేరు చెప్పుకొని అమాయకులను బలి చేసేవారిని కూడా చూశాము. అయితే అధికారాన్ని ఆసరాగా చేసుకొని దేవుడికే ఎసరు పెట్టెవారి గురించి విన్నారా… విషయం ఏంటంటే ఓ ఎమ్మెల్యే తన పదవి అండతో దేవుడి పేరుమీదున్న భూములపై(Lands) కన్నెసి స్వాధీనం చేసుకున్నాడు. పెద్దపల్లి(Peddapalli) జిల్లా ముత్తారం ధర్మాబాద్ పంచాయతీ రంగనాయక స్వామి(Ranganayak Swami) ఆలయ భూములను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి(Dasari Manohar Reddy) తన పేరు మీద మ్యూటేషన్ చేసుకున్నారంటూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆలయ భూములను మనోహర్ రెడ్డి చట్ట వ్యతిరేకంగా మ్యుటేషన్ చేయించుకున్నారని పెద్దపల్లి మండలం చందపల్లికి చెందిన జాపతి రాజశేఖర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారించారు.
గ్రామ పంచాయితీ పరిధిలో ఆలయం పేరు మీద ఉండే భూములను ఎమ్మెల్యే తన పేరు మీద చేయించుకొని దేవుడికే అన్యాయం చేస్తున్నారంటూ పిటిషనర్ రాజశేఖర్ పేర్కొన్నారు. వాదనలు విన్న జడ్జి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, పెద్దపల్లి కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ముత్తారం ధర్మాబాద్‌లోని రంగనాయక స్వామి ఆలయ ఈవోలకు నోటీసులు జారీ చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. పక్కా ఆధారాలతో కోర్టులో పిటిషన్ వేసినట్లు రాజశేఖర్ తరపు లాయర్ తెలిపారు. దీనిపై గ్రామ పంచాయితీ కూడా తీర్మానం చేసుకొని కేసుకు మద్దతుగా నిలుస్తారని రాజశేఖర్ అన్నారు.