»Eris Is A New Variant Of Omicron That Is Spreading Rapidly In Britain
Covid variant: వణుకు పుట్టిస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్
కొవిడ్ కొత్త వేరియంట్ బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ వైద్యారోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇండియాలో కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు చెబుతున్నారు.
Eris is a new variant of Omicron that is spreading rapidly in Britain
Covid variant: కరోనా(Corona) ఈ పేరు వింటే చాలు ప్రజల గుండెలు వేగంగా కొట్టుకుంటాయి. అయితే గత రెండు సంవత్సరాలుగా దీని తీవ్రత తగ్గినా ఎంతో కొంత ప్రభావం చూపుతూనే ఉంది. అంతే కాకుండా ఇందులో కొత్త వేరియంట్లు(variant) కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వార్త జనాల్లో భయం పుట్టిస్తుంది. కొవిడ్-19(Covid-19)లో ఒమిక్రాన్(Omicron) రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 అనే కొత్త వేరియంట్ ఇందుకు కారణం. ప్రస్తుతం బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌ను ఎరిస్(Eris) అని పిలుస్తున్నారు.
ఇంగ్లాండ్(England) నుంచి వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలిన వైద్యులు హచ్చరిస్తున్నారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దీని వాటా 14.6 శాతంగా ఉందని, ప్రతి 7 కేసుల్లో ఒక ఎరిస్ వ్యాధి నమోదు అవుతుందని తెలిపారు. జూలైలో ఎరిస్ కేసులు 11.8 శాతంగా ఉన్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎరిస్ తొలి కేసు హోరిజోన్ స్కానింగ్‌లో జూలై 3వ తేదీన బయటపడింది. అంతర్జాతీయంగా కూడా దీని కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎరిస్పై ఫోకస్ పెట్టింది. అయితే ప్రజలు టీకాలు పొందినప్పటికీ, ఇప్పటికే కరోనా బారినపడి, కోలుకున్నప్పటికీ దీనిపట్ల అజాగ్రత్తగా ఉండకూడదు అంటోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం కరోనాకు సంబంధించి 4,722 సీక్వెన్సులు వెలుగు చూశాయి. ఇందులో చాలావరకూ తీవ్రత లేనివే అని పేర్కొంది. హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కోవిడ్ 19 ను మే 5వ తేదీన డబ్ల్యూహెచ్ఓ(WHO) తొలగించింది. ప్రస్తుతం ఎరిస్ ఆందోళనగా మారుతోంది. దీని పూర్తి లక్షణాలు తెలియనప్పటికీ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. శ్వాసకోశ సంబంధిత సమస్య మాత్రం ఈ వేరియంట్ సోకిన వారిలో తీవ్రంగా ఉంటోందని ఓ నివేదిక పేర్కొంది.