Covid 19 New Flirt Variant : కోవిడ్ షాక్‌ల నుంచి అంతా కోలుకుని సాధారణ జీవనంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు అమెరికాలో వెలుగు చూసిన ఓ కొత్తరకం కోవిడ్ వేరియంట్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇది టీకాలకు సైతం లొంగదని, రోగనిరోధక శక్తి పని చేయదని వార్తలు వెలువడుతున్నాయి. ఈ కొత్త వేరియంట్‌ని ఫ్లిర్ట్ వేరియంట్ అని పిలుస్తున్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఈ ఫ్లిర్ట్ వేరియంట్(Flirt Variant) వల్ల జనం ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా అక్కడ ఈ కేసులు అధికం అవుతున్నాయి. ఈ స్ట్రెయిన్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందినది. ఒమిక్రాన్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయో మనందరికీ తెలిసిందే. ఈ కుటుంబానికి చెందిన సబ్ వేరియంట్‌గా ఫ్లిర్ట్ని(Flirt) చెబుతున్నారు. ఈ వేరియంట్ కేసులు ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా విస్తరిస్తున్నాయి. బూస్టర్ డోసులు తీసుకున్న వారికి కూడా ఇది సంక్రమించే అవకాశం ఉందట. వేడి వల్ల ఈ కేసులు ఎక్కువ పెరిగే అవకాలూ లేకపోలేదు.
అమెరికాలోని వ్యర్థ జలాల్ని పరీక్షించినప్పుడు ఈ వేరియంట్‌ని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, షుగర్, గుండె జబ్బుల్లాంటి ఉన్న వారు ఈ వేరియంట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, గొంతు నొప్పి, జలుబు, కండరాల నొప్పి, జీర్ణ సమస్యలు, రుచి కోల్పోవడం లాంటివి ఇది సంక్రమించిన వారిలో కనిపిస్తాయని చెబుతున్నారు.