»Fenella Used The Phone For 14 Hours A Day She Suffered From Vertigo Phone Addiction
Phone Addiction: రోజు 14 గంటలు ఫోన్ వాడింది..వెర్టిగో వ్యాధికి గురైంది
ఓ యువతి ఫోన్ ఎక్కువ సేపు ఉపయోగించి వ్యాధికి గురైంది. ప్రతి రోజు 14 గంటలు వినియోగించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫెనెల్లా ఫాక్స్(29) డిజిటల్ వెర్టిగో అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది. ఆ క్రమంలో యూకేకు చెందిన ఆమె వీల్ చైర్ కు పరిమితమై..ఆరు నెలల వైద్యం తర్వాత కోలుకున్నట్లు వెల్లడించింది.
హాయ్, హలో మీరు కూడా స్మార్ట్ ఫోన్ ఎక్కువ సేపు వాడుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే గంటల కొద్ది ఫోన్ ఉపయోగించడం వల్ల పలు రకాల వ్యాధులు తెలెత్తే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. అంతేకాదు ఇటీవల ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫెనెల్లా ఫాక్స్(29)(fenella fox) ప్రతి రోజు ఫోన్లో 14 గంటల సమయం గడిపిన తర్వాత “డిజిటల్ వెర్టిగో(digital vertigo)” అనే వ్యాధి బారిన పడినట్లు తెలిపింది. ఆ క్రమంలో ఆమె వీల్‌చైర్(wheel chair)కు పరిమితమైందని వెల్లడించింది. అయితే ఆమె తన ఫోన్(mobie) స్క్రీన్(screen)ను ఉదయం నుంచి రాత్రి వరకు చూస్తూ ఉండిపోయేదని, ఎక్కువగా ఇన్స్టాగ్రామ్(instagram)కు బానిసగా అయినట్లు తెలిపింది. ఆ నేపథ్యంలో తాను 1,56,000 మంది ఫాలోవర్లను సంపాదించుకున్నానని తెలిపింది.
ఈ యువతి పోర్చుగల్(portugal)లో ఉన్నప్పుడు తలనొప్పి, మైకం సహా పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపింది. నవంబర్ 2021 నాటికి అవి గరిష్ట స్థాయికి చేరుకున్నాయని వెల్లడించింది. ఆ క్రమంలో సరిగ్గా నడవలేనట్లు అనిపించిందని పేర్కొంది. ఆ క్రమంలో తన లక్షణాలకు ఫోన్ కారణమని తనకు తెలియదని చెప్పింది. కోవిడ్ సమయం కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చిందని అనుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత తన కోసం వంట కూడా చేసుకోలేని పరిస్థితి ఎదురైందని చెప్పుకొచ్చింది. దీంతో తాను యూకే(UK)లోని తన పేరెంట్స్ ఇంటికి చేరుకోవడానికి వీల్‌చైర్ అవసరం ఏర్పడిందని వెల్లడించింది. దీంతో తన తల్లిదండ్రులు దాదాపు ఆరు నెలల పాటు తనకు వైద్యం చేయించారని తెలిపింది.
ఫెనెల్లా తన సమస్యలకు మూలకారణం తన స్మార్ట్‌ఫోన్ అని గ్రహించలేదు. దానిని ఉపయోగించడం కొనసాగించింది. ఆమె మొత్తం ఆరుగురు వైద్యుల(doctors)ను సందర్శించింది. అయితే వారిలో ఎవరూ కూడా ఆమె లక్షణాలకు అంతర్లీన కారణాన్ని గుర్తించలేకపోయారని చెప్పింది. అప్పుడు ఆమె తండ్రి సైబర్ మోషన్ సిక్నెస్ లేదా డిజిటల్ వెర్టిగోపై అంశాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. అప్పుడు తన ఫోన్‌ను ఆఫ్ చేసి ఆల్మారా వెనుక భాగంలో విసిరానని వెల్లడించింది. తన తల్లిదండ్రులు తనకు ఫోన్(smart phone) ఇవ్వవద్దని కోరినట్లు తెలపింది. ఆ క్రమంలో కొన్ని నెలల తర్వాత ప్రస్తుతం సాధారణంగా మళ్లీ నడుస్తున్నట్లు వెల్లడించింది.
మరోవైపు దురదృష్టవశాత్తు ఫాక్స్ ఆమె ఆదాయం కోసం తన సోషల్ మీడియా(social media) స్ట్రీమ్‌లపై ఎక్కువగా ఆధారపడింది. ఆ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు, ఇన్ఫ్లుయెన్సర్ ఓన్లీ ఫ్యాన్స్‌లో కూడా ప్రముఖ వ్యక్తిగా ఉంది. దీంతో ఆమె నెలకు 15,000 డాలర్ల వరకు సంపాదించేది. కానీ ఆమెకు ఆ లక్షణాల తర్వాత త్వరగా కొలుకోవడంతో ఆమె ఫోన్‌ని తరచుగా చూడలేనని వెల్లడించింది. ఇది అవాస్తవం. అదే మన జీవితం, మన ప్రపంచం. మనం డబ్బు సంపాదించాలనుకుంటే, మనం నిద్రపోయే వరకు ఫోన్ లోనే ఉండాలని తెలిపింది. ఫెనెల్లా(fenella)ఫోన్‌ను రోజుకు చాలా గంటలు ఉపయోగిస్తే మళ్లీ ఆ వ్యాధి తిరిగి వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది.
అయితే ఫ్లాషింగ్ స్క్రీన్ ద్వారా మీరు నిశ్చలంగా ఉన్నప్పుడు సైబర్సిక్నెస్(cybersickness) ఏర్పడుతుందని డాక్టర్ గిలియన్ ఐజాక్స్ రస్సెల్ గత సంవత్సరం తెలిపారు. ఆ క్రమంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఒక రకమైన గందరగోళం ఏర్పడుతుందన్నారు. దీంతో మీ కళ్ళు ఓ విషయాన్ని గ్రహించి, మీ లోపలి చెవి సహా శరీరం ఇతర భాగాలకు ప్రసరింపజేస్తుందని తెలిపారు.