»Remote Kissing Device For Far Away Lover In China Invented By Jiang Zhongli
Kissing Device: దూరంగా ఉన్న లవర్స్ కోసం కిస్ పరికరం..నెట్టింట వైరల్
సుదూర ప్రేమికులు, జంటల కోసం చైనాలో కొత్తగా ముద్దు పరికరం’ అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరం ద్వారా నిజంగా ముద్దు పెట్టుకున్న ఫీలింగ్ కల్గుతుందని ఈ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. దీని వివరాలు, రేటు గురించి ఈ కింది వార్తలో చూసేయండి.
మీరు మీ ప్రియురాలు(lover) లేదా మీకు కావాల్సిన (couple) వారితో దూరంగా ఉన్నారా? ఆ క్రమంలో వారిని మిస్ అవడం లేదా వారిని ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుందా? అయినా నో ప్రాబ్లం. ఎందుకంటే రియల్ కిస్ మాదిరిగా ఉన్న ఓ రిమోట్ కిస్ పరికరాన్ని(remote kissing device) చైనా(china)లో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా నిజంగా కిస్ పెట్టుకున్న ఫీలింగ్ కల్గుతుందని నిర్వహకులు చెబుతున్నారు. ఇది ప్రధానంగా దూరంగా ఉన్న జంటల కోసం తయారు చేసినట్లు వెల్లడించారు.
కొంత మంది ఆవేదన
ఇది నిజమైన శారీరక సాన్నిహిత్యాన్ని పంచుకునే మార్గంగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ప్రెజర్ సెన్సార్లు(pressure sensors), యాక్యుయేటర్లతో అమర్చబడిన ఈ పరికరం వినియోగదారుల పెదవుల ఒత్తిడి, కదలిక, ఉష్ణోగ్రతను ప్రతిబింబించడం ద్వారా నిజమైన ముద్దును భావించగలరని అంటున్నారు. అంతేకాదు కిస్సింగ్ మోషన్‌తో పాటు ఇది వినియోగదారు చేసే ధ్వని(sound)ని కూడా ప్రసారం చేస్తుందని పేర్కొన్నారు. చైనా మార్కెట్లోకి వచ్చిన ఈ పరికరం పట్ల పలువురు వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తుండగా..మరికొంత మంది ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ మైనర్లు వీటిని కొనుగోలు చేస్తే ఏంటి పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఆవిష్కరణకు చాంగ్జౌ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెకాట్రానిక్ టెక్నాలజీ పేటెంట్ పొందింది. నా యూనివర్శిటీ ప్రియురాలితో దూర సంబంధాన్ని కలిగి ఉన్న క్రమంలో ఒకరితో ఒకరు ఫోన్ ద్వారా మాత్రమే మాట్లాడుకున్నాము. ఆ క్రమంలోనే ఈ ఐడియా వచ్చిందని ప్రముఖ ఆవిష్కర్త జియాంగ్(Jiang Zhongli) పేర్కొన్నారు. అయితే జియాంగ్ 2019లో దీని పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కానీ జనవరి 2023లో పేటెంట్ వచ్చిందని స్పష్టం చేశారు. మరోవైపు ఇదే విధమైన ఆవిష్కరణ “కిస్సింజర్”ను మలేషియాలోని ఇమాజినీరింగ్ ఇన్స్టిట్యూట్ 2016లో ప్రారంభించింది. కానీ అది వాస్తవికంగా కనిపించే పెదవుల కంటే టచ్-సెన్సిటివ్ సిలికాన్ ప్యాడ్ రూపంలో వచ్చిందని గుర్తు చేశారు.
కిస్సింగ్ స్క్వేర్
ముద్దును పంపడానికి, వినియోగదారులు(customers) మొబైల్ ఫోన్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. వారి ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో పరికరాన్ని ప్లగ్ చేయాలి. యాప్‌లో వారి భాగస్వాములతో ఆ పరికరాన్ని జత చేసిన తర్వాత, ఇరువురు జంటలు వీడియో కాల్(video call)ని ప్రారంభించి ప్రతిరూపాలను ఒకరికొకరు ప్రసారం చేసుకోవచ్చని వివరించారు. చైనీస్ పరికరం యాప్ “కిస్సింగ్ స్క్వేర్(missing square)” ఫంక్షన్లో అపరిచితులతో అనామకంగా జత చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఇద్దరు అపరిచితులు ఒకరినొకరు ఇష్టపడితే, వారు ముద్దులు మార్చుకోవచ్చు.
చైనా(china)లో అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ సైట్ అయిన Taobaoలో ఇవి ఒక్కొక్కటి సుమారు 260 యువాన్ (US$38), 550 యువాన్లుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ పరికరాన్ని నెలకు 100 కంటే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.