ఈ మధ్య కాలంలో చాలా మంది ఫోన్‌కు బానిసలుగా మారిపోతున్నారు. ఎప్పుడూ దానితోనే గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు మార్గాలేంటంటే...?
China's Cyberspace Regulator New Rules on Smartphone Use
How To Overcome Phone Addiction ఫోన్లు, టెక్నాలజీల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని నష్టాలూ ఉన్నాయి. ఉపయోగించుకునే తీరు తెలియనిప్పడు ఏదైనా మనకు చేటే చేస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది ఫోన్‌కు బాగా అడిక్ట్(PHONE ADDICT) అయిపోతున్నారు. ఎప్పుడూ దానిలోనూ గడుపుతున్నారు. ఒక వేళ ఏ కారణం చేత అయినా అది అందుబాటులో లేకపోతే ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అవుతున్నారు. మెంటల్‌గా చాలా డిస్ట్రబ్ అయిపోతున్నారు. ఇవన్నీ మీరు ఫోన్‌కి అడిక్ట్ అయిపోయారు అనడానికి సూచనలు. మరి ఈ అడిక్షన్ నుంచి మనం ఎలా బయటపడాలి. తెలుసుకుందాం రండి.
మనం స్మార్ట్ ఫోన్‌ని ఎందుకు ఉపయోగించాలి? అనే విషయంలో ఎప్పుడూ స్పష్టమైన లక్ష్యంతో ఉండండి. ఒక వేళ టైం పాస్ కోసమే అయినా అది ఎంత సేపు అనే దాన్ని గమనించుకోండి. గంట సమయమా? అరగంటా? అనే గడువు విధించుకోండి. అంతకంటే చూడాలనిపించినా స్వయంగా నిరోధించుకోండి. వేరే పనుల్లో మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసుకోండి. అలాగే మానిటరింగ్ యాప్స్ వాడండి. మనం ఎంత సేపు ఏ యాప్స్‌లో ఉంటున్నాం? ఫోన్లో ఎంతసేపు గడుపుతున్నాం? అనే విషయాలను అవి మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాయి. అలర్ట్ చేస్తాయి. ఆ వెంటనే మీరు ఫోన్ వాడటం ఆపేయండి.
ఇంట్లో బెడ్ రూమ్, భోజనాల గదుల్లాంటి చోట్లను ఫోన్ ఫ్రీ జోన్లుగా మార్చుకోండి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు(PHONES) వాడకూడదని మీకు మీరే నిర్ణయించుకోండి. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా తర్వత అలవాటవుతుంది. మీరు బెడ్ రూంలో ఫోన్ చూడటానికి బదులుగా పుస్తకాలు చదవడం అలవాటుగా చేసుకోండి. అది మీ నిద్రనూ మెరుగుపరుస్తుంది. అలాగే నిద్రకు రెండు గంటల ముందు నుంచి ఫోన్ చూడకూడదని నిర్ణయించుకోండి. బ్లూ లైట్ ప్రభావం వల్ల నిద్ర లేమి సమస్యలు లాంటివి ఏమైనా ఉంటే అవి సమసిపోతాయి. ఫ్రెండ్స్‌తో గడపడం, ధ్యానం, యోగా, వ్యాయామాల్లాంటి పనుల్ని పెట్టుకోండి. ఫోన్ చూడాలని అనిపించినప్పుడల్లా వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకుని చేయండి. అప్పుడు దానిపై దృష్టి తగ్గుతుంది.