రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల భారత పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చిన అధికారిక విందు అనంతరం ఆయన మాస్కోకు బయల్దేరారు. ఇవాళ జరిగిన 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, పుతిన్.. వాణిజ్యం, రక్షణరంగం సహా పలు అంశాలపై అంశాలపై చర్చించారు. ఇరువురి నేతల సమక్షంలో పలు ఒప్పందాలు జరిగాయి.