బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తెరకెక్కిన అఖండ-2 చిత్రం రిలీజ్ ఆలస్యమైన విషయం తెలిసిందే. అయితే, మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ‘సినిమాని విడుదల చేసేందుకు చాలా కష్టపడ్డాం. కానీ సాధ్యం కాలేదు. ఫ్యాన్స్, మూవీ లవర్స్ మమ్మల్ని క్షమించాలి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని ట్వీట్ చేసింది.