»Mallikarjun Kharge Ready For Alliance To Defeat Bjp 85th Congress Plenary Meeting Raipur
Mallikarjun Kharge: బీజేపీని ఓడించేందుకు పొత్తులకు సిద్ధం
దేశంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు భావసారూప్యత గల పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) అన్నారు. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశంలో భాగంగా ఖర్గే స్పష్టం చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక బీజేపీ(bjp) ప్రభుత్వాన్ని ఓడించేందుకు భావసారూప్యత కలిగిన పార్టీలతో జతకడతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పేర్కొన్నారు. ప్రజలు బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్(chhattisgarh) రాయ్‌పూర్(raipur)లో నిర్వహించిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశం(85th congress plenary meeting)లో భాగంగా ఖర్గే వెల్లడించారు. దేశం ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలపై నిరంతర దాడి, చైనా(china) సరిహద్దులో జాతీయ భద్రత సమస్యలు, ఆల్ టైమ్ అత్యధిక ద్రవ్యోల్బణం, రికార్డు స్థాయిలో నిరుద్యోగం వంటి సవాళ్లను ఎదుర్కొంటోందని విమర్శించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారతదేశంలో సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించగల ఏకైక పార్టీ కాంగ్రెస్(congress party) మాత్రమేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
మన దేశ ప్రజల సంక్షేమం కోసం పాటుపడేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అందుకోసం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(congress party)లక్ష్య సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. ఈ ప్లీనరీ సమావేశాన్ని ఆపేందుకు బీజేపీ(BJP) పార్టీ కార్యకర్తలు పలువురు కాంగ్రెస్ నేతల నివాసాలపై దాడులు చేశారని ఆయన ఆరోపించారు. ఆపై కార్యకర్తలను కూడా అరెస్టు చేశారని, కానీ మేము వాటిని ఎదుర్కొని ఈ సెషన్‌ను నిర్వహించామని పేర్కొన్నారు.
2004 నుంచి 2014 వరకు భావసారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి(alliance) దేశ ప్రజలకు సేవ చేసిందని ఖర్గే గుర్తు చేశారు. అదే మాదిరిగా భావసారూప్యం ఉన్న పార్టీలతో జతకట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేక, అప్రజాస్వామిక బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని ఓడించేందుకు పలు పార్టీలతో జతకట్టడం ద్వారా ఆచరణీయమైన ప్రత్యామ్నాయంగా మారనున్నట్లు వెెల్లడించారు.
తనను తాను ప్రధాన్ సేవక్ అని పిలుచుకునే వ్యక్తి తన స్నేహితుల ప్రయోజనాలను మాత్రమే పరిరక్షిస్తున్నాడని ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi)ని ఆయన విమర్శించారు. దేశంలో “ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి కుట్ర” జరుగుతోందని, అయితే కాంగ్రెస్ అందరినీ ఏకం చేయడానికి కృషి చేస్తోందని ఖర్గే ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ(GST) అమలు సహా అనేక అంశాల కారణంగా దేశం ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని ఆరోపించారు. బీజేపీ(BJP) ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని..ఈ క్రమంలో దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేయాలని మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పిలుపునిచ్చారు.