»Ram Charan Reveals Names Of Two Hollywood Actresses He Had Huge Crush
Ram Charan: ఆ ఇద్దరితో క్రష్ గురించి చెప్పిన చెర్రీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తనకు ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్ ల పట్ల క్రష్ ఉందని చెప్పారు. రామ్ చరణ్ దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు, రికార్డులతో ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తనకు ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్ ల పట్ల క్రష్ ఉందని చెప్పారు. రామ్ చరణ్ దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక అవార్డులు, రికార్డులతో ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో బిజీగా ఉన్న చెర్రీ ఓ కార్యక్రమంలో తాను పెరుగుతున్న సమయంలో ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్లతో క్రష్ ఉందని చెప్పారు. తాను జూలియా రాబర్ట్ ను చూసి ముగ్ధుడను అయ్యేవాడినని చెప్పారు. సినిమా చూసినప్పుడు అలాగే స్క్రీన్ కు అతుక్కు పోయేవాడిని అన్నారు. అలాగే కేథరిన్ జేటా జోన్స్ కూడా అద్భుతం అని, ఎలా మరువగలం అని పెరుగుతున్న వయసులోని స్మృతులను గుర్తుకు తెచ్చుకున్నారు. మాస్క్ ఆఫ్ ది జోరో సినిమాని గుర్తు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ కు హాలీవుడ్ నేటి ఒకరు క్షమాపణ చెప్పారు. అమెరికన్ నటి టిగ్ నోటరో.. చరణ్ పేరు పలకలేక పోయినందుకు సారీ చెప్పారు. ఆ పేరు ఎలా ఆ పలకలో తనకు తెలియడం లేదు అన్నారు. కాలిఫోర్నియా వేదికగా జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవం లో చెర్రీ సందడి చేశారు. టిగ్ నోటరో వ్యాఖ్యాత గా వ్యవహరించారు. చరణ్ అవార్డ్ ప్రెజెంటర్ గా ఉన్నారు. హాలీవుడ్ నటి అంజలి తో కలిసి బెస్ట్ వాయిస్/మోషన్ క్యాప్చర్ అవార్డ్ అందించారు. ఈ సమయంలో చరణ్ ను పిలిచే సమయంలో RRR సినిమాతో విజయాన్ని అందుకున్న ఇంటర్నేషల్ ఫిల్మ్ స్టార్ రామ్.. అంటూ చరణ్ అనే పదం పలకడం తెలియడం లేదు అన్నారు. అక్కడ ఉన్న కొందరు సాయంతో చరణ్ అని పిలిచారు.