తెలంగాణలో నాన్ వెజ్ ప్రియులకు శుభవార్త. ఎందుకంటే త్వరలోనే మొదటిసారిగా హైదరాబాద్ పరిధిలో మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ది సంస్థ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్లు సక్సెస్ అయిన క్రమంలో.. మటన్ క్యాంటీన్లను మార్చిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో మాంసాహార ప్రియులు ఎక్కువగా ఉంటారు. వీకెండ్ వస్తే(week end) చాలు ఇంట్లో నానా వెజ్(non veg) వంటకం ఉండాల్సిందే. ఇక మరికొన్ని కుటుంబాల్లో అయితే వారానికి రెండు మూడు సార్లు మాంసం వంటకాలను తింటుంటారు. అంతేకాదు ఒక్క స్విగ్గీలోనే హైదరాబాద్లో రోజుకు 10 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు వస్తాయని గతంలో స్వీగ్గీ ప్రకటించింది. ఇక జోమాటోతోపాటు ఇతర ప్రముఖ రెస్టారెంట్ల నుంచి నాన్ వెజ్ వంటకాల పార్సల్స్ ఇంకా వెళుతూనే ఉంటాయి. దీన్ని బట్టి రాష్ట్రంలో మాంసానికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాదు ఇప్పటికే 2019, 2021 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా తెలంగాణ, ఏపీలో 97.30 శాతం మంది మాంసాహారం తింటారని వెల్లడించింది. అయితే వెజ్ మాత్రం కేవలం 2.70 శాతం మంది మాత్రమే తింటున్నారని తెలిపింది. దీంతోపాటు తెలంగాణ(telangana)లో జనాభాలో 73 శాతం మంది వారానికి ఓసారి మాత్రం తప్పకుండా మాంసం తింటున్నట్లు ఈ సర్వే తెలిపింది. మరోవైపు అతి తక్కువ మాంసం స్వీకరించే రాష్ట్రాల్లో రాజస్థాన్, హర్యానా, గుజరాత్, పంజాబ్ ఉన్నాయి.
డిమాండ్ నేపథ్యంలో
అయితే ఈ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ ప్రభుత్వం(telangana governament) సరికొత్తగా రాష్ట్రంలో మటన్ క్యాంటీన్ల(mutton canteens)ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో గొర్రెల పంపిణీ స్కీం అందుబాటులోకి వచ్చిన తర్వాత మటన్ వినియోగం మరింత పెరిగింది. ఈ క్రమంలో మటన్(mutton) వంటకాలతో కూడిన ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ది ఫెడరేషన్ సైతం ఈ అంశంపై సమావేశం చేపట్టి క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
ఈ క్రమంలో మొదట హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ గొర్రెల, మేకల అభివృద్ది సంస్థ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు(dudimetla balaraju) యాదవ్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మితో భేటీ అయ్యి చర్చించారు. తొలుత ఇక్కడ భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన తర్వాత విజయవంతమైతే తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మంచి క్వాలిటీ మటన్ వినియోగదారులకు అందించేందుకు చెంగిచర్లలోని ప్రభుత్వ కబేళా నుంచి మటన్ కొనుగోలు చేస్తామని నిర్వహకులు చెబుతున్నారు. ఈ ఫేడరేషన్ ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో చెఫ్ లను కూడా నియమించుకున్నట్లు వెల్లడించింది. అయితే ఫిష్ క్యాంటీన్ల(fish canteens) సక్సెస్ తర్వాత మటన్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని భావించినట్లు దూదిమెట్ల బాలరాజు వెల్లడించారు. ఈ క్రమంలో భాగ్యనగరంలో సక్సెస్ అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు.
పలు రకాల వంటకాలు
ఈ క్యాంటీన్లలో మటన్ పాయ, బిర్యానీ, గుర్దా ప్రై, కీమా, పత్తార్ కా గోస్ట్ సహా పలు రకాల వంటకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో మొదటి క్యాంటీన్ హైదరాబాద్ శాంతినగర్ కాలనీ(shanti nagar colony)లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇది మార్చిలో ప్రారంభం కానుందని…క్యాంటీన్లో మెనూ రేట్లు కూడా త్వరలోనే నిర్ణయించనున్నట్లు దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెల్లడించారు.