Tirumala Tirupathi: ప్లాస్టిక్ నిషేధంపై టీటీడీ మరో ప్రయత్నం
తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం పర్యావరణ పరిరక్షణకు అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా టీటీడీ(TTD) ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మరో వినూత్న ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని(Srivari laddu prasadam) ఇక నుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించనుంది.
తిరుమల(Tirumala) పుణ్యక్షేత్రం పర్యావరణ పరిరక్షణకు అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా టీటీడీ(TTD) ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు మరో వినూత్న ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని(Srivari laddu prasadam) ఇక నుంచి తాటాకు బుట్టల్లో భక్తులకు అందించనుంది. తిరుమల(Tirumala)లో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో టీటీడీ(TTD) ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులందరికీ అందుబాటులో ఉంచేందుకు తాటాకు బుట్టలను తీసుకొస్తోంది.
తాటాకు బుట్టలు వినియోగిస్తే ప్లాస్టిక్(Plastic) వినియోగం తగ్గుతుంది. దీంతో పర్యావరణ పరిరక్షణ జరగడమే కాకుండా హస్తకళలను ప్రోత్సహించినట్లు అవుతుంది. అందుకే టీటీడీ(TTD) ఈ నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ తాటాకులతో చేసిన వివిధ రకాల సైజుల్లోని బుట్టలను ఈ సందర్భంగా టీటీడీ(TTD) ఈవో ధర్మారెడ్డికి అందించారు. తాటాకు బుట్టలను త్వరలోనే లడ్డూ కౌంటర్లలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
తాటాకు బుట్టల వినియోగంతో పాటుగా లడ్డూ ప్రసదాలను తీసుకెళ్లే భక్తులకు తాటాకు బుట్టలు ఎంతమేర ఉపయోగకరంగా ఉంటాయన్న దానిపై కూడా టీటీడీ(TTD) అధ్యయనం చేయనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. ప్రస్తుతం తిరుమల క్షేత్రం(Tirumala Temple)లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో పాటుగా ప్లాస్టిక్ కవర్ల(Plastic Bags)ను కూడా టీటీడీ(TTD) అనుమతించడం లేదు. అంతేకాకుండా ఆలయానికి సంబంధించిన షాపుల్లో కూడా ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేసింది. ప్లాస్టిక్ బాటిళ్ల(Plastic Bottles) అమ్మకాలను కూడా తిరుమల(Tirumala)లో నిషేధించారు. వాటర్ బాటిల్స్ కు బదులుగా గాసు సీసాలను టీటీడీ(TTD) వినియోగిస్తోంది. త్వరలోనే తాటాకు బుట్టలను కూడా వినియోగించేలా చర్యలు చేపట్టనుంది.