»Ap Tourism Coffee Table Books Were Launched By Cm Jagan
CM Jagan : ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్ ఆవిష్కరించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ టూరిజం (Tourism) శాఖ రూపొందించిన ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్‌ను ఏపీ సీఎం (CM AP) జగన్ ఆవిష్కరించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో (Vizag) జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్ పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది
ఆంధ్రప్రదేశ్ టూరిజం (Tourism) శాఖ రూపొందించిన ఏపీ టూరిజం కాఫీ టేబుల్ బుక్స్‌ను ఏపీ సీఎం (CM AP) జగన్ ఆవిష్కరించారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో (Vizag) జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నేపథ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్ స్పేస్, ఏ టూ జెడ్ టేబుల్ గైడ్ పై ప్రత్యేక పుస్తకాలను ప్రచురించింది ఏపీ ప్రభుత్వం.. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్ బాషల్లో ఈ పుస్తకాలను ముద్రించారు.. ఎయిర్పోర్ట్ (Airport) లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో ఏపీ ప్రత్యేకతలను ఈ పుస్తకాల్లో వివరించారు.. ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆ బుక్స్‌ను ఆయన ఆవిష్కరించారు. ఏపీలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలు పొందుపర్చారు.. బెస్ట్ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ ప్రభుత్వ టూరిజం శాఖ, ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు టూరిజం (Tourism) శాఖ అధికారులు. దీంతో.. వారిని అభినందించిన ముఖ్యమంత్రి, రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్ గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలని సీఎం అన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టూరిజం శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.కరికాల్ వలవెన్, సమాచార శాఖ కమిషనర్ తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.